Afghanistan:ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 50 మంది మృతి.. 100 మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.

  • Written By:
  • Publish Date - May 11, 2024 / 12:29 PM IST

Afghanistan:ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు. ఐదు జిల్లాలకు పైగా వరదలు ప్రభావితమయ్యాయని, 150 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని, వారికి సహాయం అవసరమని ఆయన అన్నారు.

కాబూల్‌ను ముంచెత్తిన వరదలు..(Afghanistan)

ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్రాంతానికి బృందాలు మరియు హెలికాప్టర్లను పంపిందని ఖానీ చెప్పారు. వరదలు వివిధ జిల్లాల్లోని ఇళ్లు మరియు ఆస్తులను కూడా దెబ్బతీశాయని బగ్లాన్‌లోని ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రాంతీయ డైరెక్టర్ ఎదయతుల్లా హమ్దార్ద్ తెలిపారు.రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు.రెస్క్యూ బృందాలు, ఆహారం, ఇతర సహాయక సామగ్రి ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లు చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో గత నెలలో ఆకస్మిక వరదల కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వరదల్లో దాదాపు 2,000 ఇళ్లు, 3 మసీదులు, 4 పాఠశాలలు దెబ్బతిన్నాయి. వరదలు వ్యవసాయ భూమిని కూడా దెబ్బతీయగా సుమారు 2,500 జంతువులు మరణించాయి.