Site icon Prime9

Abraham Lincoln Wax Statue: ఎండ వేడికి కరిగిపోయిన అబ్రహం లింకన్ మైనపు విగ్రహం

Abraham Lincoln Wax Statue

Abraham Lincoln Wax Statue

Abraham Lincoln: ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాషింగ్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆరడుగుల మైనపు విగ్రహం కరిగిపోయింది. క్యాంప్ బార్కర్ లో ఉన్న ఈ విగ్రహం తల ఎండ వేడికి ముందుగా విగ్రహం తల, తరువాత కాళ్లు కరిగిపోయాయి. అది కూర్చున్న కుర్చీ కూడా భూమిలో కలిసి పోయింది.అధికారులు విగ్రహానికి మరమ్మతులు చేసే పనిలో పడ్డారు.

విపరీతమైన వేడికి.. (Abraham Lincoln Wax Statue)

విగ్రహం మెడ నుంచి వైరు పొడుచుకు రావడంతో తల ఇప్పుడు మరమ్మతులకు గురైంది. ఇది ఈ వారంలో తిరిగి సెట్ అవుతుందని తెలుస్తోంది. నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కల్చరల్ డిసి చే నియమించబడిన ఈ ప్రతిరూపాన్ని సెప్టెంబర్ 2024 వరకు సైట్‌లో ఉంచాలని నిర్ణయించారు. ఈ విగ్రహాన్ని యూఎస్ కు చెందిన కళాకారుడు శాండీ విలియమ్స్ రూపొందించారు. ఇది ఇప్పుడు ప్రాథమిక పాఠశాలను కలిగి ఉన్న క్యాంప్ బార్కర్ స్థలంలో ఉంచబడింది. ఈ మైనపు శిల్పం కొవ్వొత్తిలా కరిగిపోయేలా కాలక్రమేణా మారేలా రూపొందించబడింది, అయితే విపరీతమైన వేడి విగ్రహాన్ని దెబ్బతీసిందని నిర్వాహకులు తెలిపారు.

Exit mobile version