Brazil Floods : బ్రెజిల్‌లో వరదలకారణంగా మరణించిన వారి సంఖ్య 78కి పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు, 115,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తన క్యాబినెట్‌లోని సభ్యులతో కలిసి స్థానిక అధికారులతో రెస్క్యూ మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలపై చర్చించారు.
రాష్ట్ర సివిల్ డిఫెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం , ఆదివారం నాడు 105 మంది తప్పిపోయినట్లు తెలిసింది.దీనితో మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. సుమారుగా 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని తుఫానుల నుండి వరదలు ప్రభావితం చేశాయి, వరదల కారణంగా పలు నగరాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం. ఒక చిన్న జలవిద్యుత్ కేంద్రం వద్ద డ్యామ్ పాక్షికంగా కూలిపోవడం కూడా జరిగింది.400,000 మందికి పైగా ప్రజలు కరెంటు లేకుండా ఉన్నారు, రాష్ట్ర జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది నీరు లేకుండా ఉన్నారని అధికారులు తెలిపారు.పోర్టో అలెగ్రే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అన్ని విమానసర్వీసులను నిలిపివేసారు.