Boat Accident In Nigeria: ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు వచ్చి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీనితో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద ప్రహవాం పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దానితో 76 మంది నీటిలో మునిగి మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
నైగర్ నదిలో పడవ ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కాగా ఇప్పటివరకు 76 మంది మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. ఈ హృదయవిదారక ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవలోని ప్రతిఒక్కరి ఆచూకీ లభించేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.
భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి.. 22 మంది మృతి