Site icon Prime9

Measles: మీజిల్స్ విలయతాండవం… 700 మంది చిన్నారులు మృత్యువాత

700 Children Died Due To Measles

700 Children Died Due To Measles: ప్రపంచంలో ఏదో ఒక మూల తరచూ అనేక రకాలు వ్యాధులు వ్యాపిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయతాండవం సృష్టిస్తుంది. ద‌గ్గు, తుమ్ములతో వ‌చ్చే అంటు వ్యాధుల్లో ఒకటిగా మీజిల్స్ వ్యాధిని చెప్పవచ్చు.

మీజిల్స్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు..

జింబాబ్వేలోని మనికాల్యాండ్‌ ప్రావిన్సులో ఏఫ్రిల్ తొలివారంలో మొట్టమొదటి సారిగా మీజిల్స్‌ వ్యాధిని గుర్తించారు.  దీనిని గుర్తించిన కొద్ది వారాల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించి అనేక మంది ప్రాణాలను హరించివేస్తుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 6291గా నమోదయ్యింది. కాగా 698 మంది ఈ వ్యాధి సోకి మరణించినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 1న ఒక్కరోజే అత్యధికంగా 37మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 700 మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన ప‌డ్డార‌ని ఆరోగ్య శాఖ గణాంకాలు వెలువరించింది. రెండు వారాల క్రితం వరకు కేవలం 157 మరణాలే నమోదవ్వగా.. తాజాగా ఆ సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొనింది. జింబాబ్వేలో మీజిల్స్ మృత్యువాత కేసులు ఎక్కువ కావడంతో యునిసెఫ్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

మతవిశ్వాసాలే వ్యాధికి కారణమా..

జింబాబ్వేలో మ‌త పరమైన విశ్వాసాలు ఎక్కువ. వాటిని గుడ్డిగా ఆచరిస్తున్న వారు కొందరు పిల్లలకు టీకా వేయించడం పెద్ద పాపంగా భావిస్తూ టీకాకు దూరంగా ఉన్నాయ‌ని నివేదిక‌లు వెల్లడించాయి. ఇటీవలె కాలంలో చనిపోయిన చిన్నారులంతా చాలావరకు టీకా వేయిచుకోని వారే అని జింబాబ్వే స‌మాచార‌శాఖ మంత్రి మొనైకా ముత్స‌వాంగ తెలిపారు. కావున దేశంలోని 6 నెల‌లు-15 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు గ‌ల పిల్ల‌లంద‌రూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి వ్యాక్సిన్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి అవ‌గాహ‌న కార్యక్రమాలు చేపట్టాలిని జింబాబ్వే మెడిక‌ల్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జొహ‌న్న‌స్ మ‌రిసా అన్నారు.

మీజిల్స్ లక్షణాలు

ద‌గ్గుతోపాటు జ్వ‌రం రావడం. చ‌ర్మంపై దుద్దుర్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో చూడవచ్చు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో ఈ అంటు వ్యాధి వ్యాపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

Exit mobile version