Site icon Prime9

Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 33 మంది మృతి

Israeli Strikes

Israeli Strikes

Israeli Strikes: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 33 మంది మరణించారు. లెబనాన్ నుండి ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన ఆరు రాకెట్లను అడ్డుకున్నామని, దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

75 మందికి గాయాలు..(Israeli Strikes)

గాజా స్ట్రిప్‌లో మానవతా సామాగ్రి పెంపుపై భద్రతా మండలి (UNSC) ఓటింగ్ ఆలస్యమయింది. రెండు నెలల పాటు సాగిన సంఘర్షణపై అమెరికా వీటో చర్యను నివారించడానికి చర్చలు జరుగుతున్నందున ఆలస్యమైంది.ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కొత్త ఒప్పందంపై చర్చలలో కొంత పురోగతి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న కొన్ని కుటుంబాలను కలిశారు. చెర నుంచి తప్పించుకున్న ముగ్గురు బందీలను గత వారం ఇజ్రాయెల్ సైన్యం ప్రమాదవశాత్తు చంపిన విషయం తెలిసిందే. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈజిప్టు సరిహద్దుకు సమీపంలోని రఫాలో 20 మంది మరియు గాజా నగరంలోని జబాలియా శరణార్థి శిబిరంలో మరో 13 మంది మరణించారు. శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 75 మంది గాయపడ్డారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

ఇజ్రాయెల్ కు శత్రువు అయిన ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీలు ఎర్ర సముద్రంలో ఓడలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా, హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులు మరియు డ్రోన్లతో నౌకలపై దాడి చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ తన బాంబు దాడులను ఆపని పక్షంలో తమ దాడులను కొనసాగిస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ దాడి ఫలితంగా దాదాపు 20,000 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌లో దాదాపు 1,200 మంది చనిపోయారు.

Exit mobile version