Site icon Prime9

Ukraine Shelling; రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రెయిన్ కాల్పులు.. 27 మంది మృతి

Ukraine shelling

Ukraine shelling

Ukraine Shelling;  తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.

100 కు పైగా ప్రాంతాల్లో..(Ukraine Shelling)

ఉక్రేనియన్ దళాలు దుకాణాలు మరియు మార్కెట్ ఉన్న రద్దీగా ఉండే ప్రాంతంపై బాంబు దాడి చేశాయని చెప్పారు. ఘటనా స్థలంలో రాయిటర్స్ ఫోటోగ్రాఫ్‌లు, వీడియోల్లో వ్యక్తులు ఏడుస్తూ కనపించారు. వారిలో కొందరు వారు బంధువులను కోల్పోయారని చెప్పారు. పలువురి మృతదేహాలు రక్తంతో తడిసిన మంచుపై పడి ఉన్నాయి. పుషిలిన్ డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లో సోమవారం సంతాప దినాన్ని ప్రకటించారు.తన వీడియో ప్రసంగంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్కోదిమిర్ జెలెన్స్కీ ఈ దాడి గురించి ప్రస్తావించలేదు. అయితే ఒక్క రోజులో రష్యా ఉక్రెయిన్‌లోని తొమ్మిది ప్రాంతాలలో 100 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కాల్పులు జరిపిందని డోనెట్స్క్ ప్రాంతంలో తీవ్రమైన దాడులు జరిగాయని అన్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన రష్యా, గతంలో ఉక్రెయిన్ దాడులు డొనెట్స్క్ మరియు ఇతర ప్రాంతాలలో పౌరులను చంపినప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే రష్యా యొక్క వైమానిక దాడులు , కాల్పులు వేలాది మంది ఉక్రేనియన్ పౌరులను చంపాయి.

Exit mobile version