Russia: దక్షిణ రష్యా ప్రాంతంలోని డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 25 మంది మరణించారని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ నివేదించింది. సోమవారం రాత్రి దగేస్తానీ రాజధాని మఖచ్కలలో ఆటో రిపేరు షాపులో మంటలు ప్రారంభమయ్యాయి.పేలుళ్లు సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫుటేజీలో ఒక అంతస్థుల భవనం దగ్ధమైనట్లు చూపించిందని రాయిటర్స్ టీవీ పేర్కొంది.గాయపడిన వారి సంఖ్య 66కి పెరిగింది. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రష్యా డిప్యూటీ ఆరోగ్య మంత్రి వ్లాదిమిర్ ఫిసెంకో తెలిపారు. క్షతగాత్రులలో 13 మంది పిల్లలు ఉన్నారు. 600 చదరపు మీటర్ల (715 చదరపు గజాలు) విస్తీర్ణంలో వ్యాపించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది.