Nigeria School Collapse: ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కళాశాలలో ఈ సంఘటన జరిగింది.
పాఠశాల శిధిలాల కింద 154 మంది విద్యార్థులు చిక్కుకోగా వారిలో 132 మందిని రక్షించి చికిత్స కోసం వివిధ ఆసుపత్రులలో చేర్చారు. 22 మంది విద్యార్థులు చనిపోయారని పోలీసు ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు.రెస్క్యూ ఆపరేషన్‌ను రెస్క్యూ మరియు ఆరోగ్య కార్యకర్తలు, అలాగే భద్రతా దళాలు ప్రారంభించినట్లు నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.సత్వర వైద్య సంరక్షణకు డాక్యుమెంటేషన్ లేదా చెల్లింపు లేకుండా చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించిందని రాష్ట్ర సమాచార కమిషనర్ మూసా ఆషోమ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో భవనాలు కూలిపోవడం సర్వసాధారణమైపోయింది, గత రెండేళ్లలో ఇటువంటి సంఘటనలు డజనుకు పైగా నమోదయ్యాయి. బిల్డింగ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో వైఫల్యం మరియు పేలవమైన నిర్వహణ కారణంగా అధికారులు తరచుగా ఇటువంటి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి.