Site icon Prime9

Venezuela: కొండచరియలు విరిగిపడి.. 22 మంది మృతి

Venezuela landslides

Venezuela landslides

Venezuela: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలోని లాస్‌ టెజెరస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దేశ ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశ ముందని ఆయన వెల్లడించారు. నగరంలోని ఇళ్లు, వ్యాపార సముదాయాలు పెద్ద సంఖ్యలో నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. నెలరోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే పడటంతో భారీగా నష్టం జరిగిందన్నారు.

లాస్‌ టెజెరాస్‌ ఘటనపై వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ ముదురో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కాగా, వెనెజులాలోని భారీ వర్షాల వల్ల దేశంలోని 23 రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఇదీ చదవండి: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

Exit mobile version