Site icon Prime9

Mass Shooting : అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి. 55 మందికి గాయాలు !

22 died and 50 injured on mass shooting at maine in usa

22 died and 50 injured on mass shooting at maine in usa

Mass Shooting : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మైనేలోని లెవిస్టన్ నగరంలో గల ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, బౌలింగ్‌ అలే వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ రహితంగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో  ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. కాగా బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

ప్రజలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతాల్లో నిందితుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారని.. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుడు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదే విధంగా ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఆ ఫొటోలలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించి, గడ్డంతో చేతిలో సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌ పట్టుకొని కనిపిస్తున్నాడు.

. నిందితుడిని రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. ఇతడు మైనేలోని యూఎస్‌ ఆర్మీ రిజర్వ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఫైర్‌ఆర్మ్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల రాబర్ట్‌.. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మైనే ప్రాంతంలోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

 

 

Exit mobile version