Crocodiles Crawl into Cities: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర మెక్సికన్ రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని పట్టణ ప్రాంతంలో సుమారుగా 200 మొసళ్ళు ప్రవేశించాయని అధికారులు తెలిపారు. జాన్ నుంచి ఇప్పటి వరకు బెరిల్ హరికేన్ ఇతర తుఫాన్లతో ఇక్కడ కుండపోత వర్షాలు కురిసాయి. దీనితో ఈ మొసళ్లు నగరంలోకి ప్రవేశించాయని వారు చెబుతున్నారు. మొసళ్ల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
భారీ వర్షాలు తీర ప్రాంత మడుగుల్లో నీటి మట్టాలను పెంచాయని దీనితో మొసళ్లు టాంపికో, సియుడాడ్ మాడెరో, అల్టామిరా వంటి నగరాల్లోకి ప్రవేశించాయిని తెలుస్తోంది. ఇక్కడ సుమారుగా 165 మొసళ్లను బంధించి తరలించినట్లు అధికారులు తెలిపారు. జూన్‌లో ఈ ప్రాంతంలో మరో 40 మొసళ్లను బంధించామని, వాటిని జనావాస ప్రాంతాల బయటకు తరలించామని రాష్ట్ర పర్యావరణ విభాగం అధిపతి కరీనా లిజెత్ సాల్ద్వార్ చెప్పారు. వీధులు, డ్రైనేజీ కాలువలు వంటి ప్రదేశాలలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో మొసళ్లు బయటపడే అవకాశముందని ఆయన అన్నారు.