Site icon Prime9

Pakistan: పాకిస్థాన్‌లో బస్సు లోయలోపడి 20 మంది మృతి

Pakistan

Pakistan

Pakistan:పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు లోయలో పడటంతో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బస్సు పంజాబ్‌లోని రావల్పిండి ప్రావిన్స్ నుండి హుంజాకు వెళ్తుండగా గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

21మందికి గాయాలు..(Pakistan)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన కనీసం 21 మందిని చిలాస్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు ఒక అధికారి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ముగ్గురు మహిళలతో సహా మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారి తెలిపారు.డయామర్ జిల్లా రెస్క్యూ అధికారి షౌకత్ రియాజ్ . ఈ ప్రమాదం తెల్లవారుజామున 5:30 గంటలకు జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాదంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.గిల్గిత్ బాల్టిస్తాన్ ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అధ్వాన్నమైన రోడ్లు, భద్రతా అవగాహన లేకపోవడం మరియు ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం తరచుగా పాకిస్తాన్‌లో ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫిబ్రవరిలో, వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడడంతో 10 మంది మరణించగా 15 మంది గాయపడ్డారు. గత ఏడాది డిసెంబరులో, బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్‌లోని షా నూరానీ మందిరం నుండి కరాచీకి వెళుతుండగా యాత్రికులను తీసుకువెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం ఒక ప్రయాణీకుడు మరణించగా పలువురు గాయపడ్డారు.

Exit mobile version
Skip to toolbar