Site icon Prime9

US-British Airstrikes: అమెరికా, బ్రిటన్‌ దాడుల్లో 16 మంది హౌతీ రెబెల్స్‌ మృతి

US-British airstrikes

US-British airstrikes

 US-British Airstrikes: ఎర్ర సముద్రం చుట్టు పక్కల హౌతీ రెబెల్స్‌ దారుణాలకు అంతే లేకుండా పోయింది. ఆ మార్గం గుండా ప్రయాణించే సరకు రవాణా నౌకలను హైజాక్‌ చేసి తీసుకెళ్లిన ఘటనలు కొకొల్లలు. ఇండియాకు చెందిన నౌకలను కూడా హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యాన్ని పంపించి వారి చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించారు. గాజాపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున యుద్ధానికి తెగబడ్డంతో గాజాకు సంఘీభావంతో తెలుపుతూ పాశ్చాత దేశానికి చెందిన వాణిజ్య నౌకలను ఎర్ర సముద్రంలో హైతీ రెబెల్స్‌ హైజాక్‌ చేసే వారు.

వాణిజ్య నౌకలే టార్గెట్..( US-British Airstrikes)

యేమన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌ను అణచివేయడానికి అమెరికాతో పాటు బ్రిటన్‌ కూడా రంగంలోకి దిగింది. శుక్రవారం సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 16 మంది చనిపోగా.. మరో 41 మంది వరకు గాయపడ్డారు. కాగా హౌతీ మీడియాతో మాత్రం 14 మంది చనిపోయారని వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో హైతీ రెబెల్స్‌ మృత్యువాత పడిన ఘటనలు లేవు. గత ఏడాది నవంబర్‌ నుంచి ఎర్ర సముద్రం, గల్ప్‌ ఆఫ్‌ ఎడెన్‌ మార్గం గుండా ప్రయాణించే సరకు రవాణా నౌకలను హౌతీ రెబెల్స్‌ కిడ్నాప్‌ చేసి పెద్ద ఎత్తున డబ్బు దండుకోవడం మామూలైపోయింది. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు తాము వాణిజ్య నౌకలను హైజాక్‌ చేసి వచ్చిన డబ్బును గాజా ప్రజలకు అందిస్తున్నామని తమ చర్యను సమర్థించుకుంటోంది హౌతీ రెబెల్స్‌.

ఇదిలా ఉండగా అమెరికాతో పాటు బ్రిటన్‌ వైమానిక దాడులతో మేమన్‌ రాజధాని సనా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు బాంబులతో దద్దరిల్లిపోయిందని ఫ్రెంచి వార్తా సంస్థ ఎఎఫ్‌పీ వెల్లడించింది. హౌతీలు నడిపిస్తున్న అల్‌ మసిరాహ టెలివిజన్‌ చానల్‌లో కూడా 14 మంది చనిపోయారని 30 మంది గాయపడ్డారని వెల్లడించింది. తాయిజ్‌ పట్టణంలోని టెలికమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌పై దాడులు చేశారని టీవీ చానల్‌ వివరించింది. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన సెంట్రల్‌ కమాండ్‌ ఒక ప్రకటనలో మొత్తం 13 హౌతీ సైట్‌లను లక్ష్యంగా చేసుకొని దాడుల చేశామని వెల్లడించింది. తమ భద్రతదళాలను రక్షించుకోవడానికి దాడులు చేయాల్సి వచ్చిందని తన చర్యను సమర్థించుకుందిన అమెరికా. అదే కాకుండా అంతర్జాతీయ జలాల మీదుగా సరకు రవాణా సాఫీగా సాగాలంటే హౌతీలను మట్టుబెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు అమెరికా, బ్రిటన్‌ అధికారులు.

Exit mobile version