Australia:ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ఇండియన్ కమ్యూనిటికి చెందిన బాలేష్ దంఖర్ పై డజనకు పైగా రేప్ కేసుల విచారణ జరుగుతోంది. ఆయన మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వాటిని రికార్డు కూడా చేశాడు. కొరియన్ మహిళలంటే చాలా ఇష్టమట. ఎంత మందిని రేప్ చేసింది కూడా లెడ్జర్ తయారు చేసి వాటిలో రాసుకున్నాడు.కాగా బాలేష్ సిడ్నిలో డజన్ కంటే ఎక్కువ మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వాటిని తన హిడెన్ కెమెరాలో రికార్డు చేశాడు. ఈ వీడియోలను చూసిన జడ్జిలు అత్యంత జుగుత్సారంగా ఉన్నాయని వ్యాఖ్యానించారంటే బాలేష్ కామ క్రీడలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
మహిళలకు ఉద్యోగాల ఆశ చూపి..(Australia)
ఇదిలా ఉండగా బాలేష్ దంఖర్‌పై ఆస్ట్రేలియాలో రేప్ కేసులు.. వాటిని చిత్రీకరించినందుకు మొత్తం 13 కేసులపై విచారణ కొనసాగుతోంది. బాలేష్ మహిళలపై తన అపార్టుమెంట్‌తో పాటు సిడ్నిలోని అత్యంత ఖరీదైన హోటల్‌లో అత్యాచారానికి పాల్పడేవాడు. సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ సమాచారం ప్రకారం .. బాలేష్ ప్రధానంగా కొరియన్ మహిళలంటే పడి చస్తాడని రాసుకొచ్చారు. వారికి ఉద్యోగాల ఆశ కల్పించి ఇంటర్వ్యూలకు పిలిపించే వాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులు న్యూ సౌత్ వెల్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరుగుతోంది.బాలేష్‌పై నమోదైన మొత్తం 13 లైంగిక దాడుల కేసుల్లో తాను అమాయకుడినని వాదిస్తున్నాడు. కాగా ఈ అత్యాచారాలన్నీ 2018 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో చేశాడు. ప్రాసిక్యూషన్ సమాచారం ప్రకారం బాలేష్ న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ఇంగ్లీషు వచ్చిన కొరియన్ మహిళలను రిక్రూట్ చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చేవారు. అటు తర్వాత బాలేష్ కొరియన్ మహిళలను సిడ్నిలోని హిల్టన్ హోటల్ బార్‌లో కలిసి అటు తర్వాత తన అపార్టుమెంటుకు తీసుకువెళ్లేవాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.
మత్తు మందు ఇచ్చి అత్యాచారం..
అపార్టుమెంటుకు తీసుకువెళ్లిన తర్వాత మహిళలకు డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చేవాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఏషియన్ కొరియన్ మహిళలతో సెక్సులో పాల్గొనే వాడు. ఇవన్నీ రికార్డు చేసేవాడు. కొంత మంది మహిళలు బాలేష్ ఇచ్చిన డ్రింక్స్ తాగిన తర్వాత తాము మత్తులోకి జారుకొన్నామని.. అయితే తమను రేప్ చేసిన విషయం కూడా తమకు తెలియదని కోర్టుకు చెప్పారు. అయితే బాలేష్ దంఖర్ హార్డ్ డిస్క్ నుంచి వీడియోలు తీస్తే భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి.కాగా పోలీసులు బాలేష్ నుంచి మొత్తం 47 వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా కొరియన్ మహిళలతో సెక్సులో పాల్గొన్న వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోలను బాలేష్ ఓ పోల్డర్ క్రియేట్ చేసి వాటిలో పేర్లతో సహా స్టోర్ చేశాడని సర్జెంట్ కట్రినా గైడే ఈ కేసును విచారిస్తున్న ఆఫీసర్ కోర్టుకు తెలియజేశారు. కాగా బాలేష్ తాను సెక్సు చేసే దృశ్యాలను అలారం క్లాక్ వెనుక దాచిపెట్టి రికార్డు చేశాడని చెప్పారు.
ఇదిలా ఉండగా పోలీసులు బాలేష్ అపార్టుమెంట్‌పై అక్టోబర్ 2018లో దాడులు చేశారు. బాలేష్ రేప్ చేసిన మహిళ పేర్లను బెడ్డింగ్, బెడ్‌షీట్లను డీఎన్‌ఎలను సాక్షిగా కోర్టుకు అందజేశారు. బాలేష్ ప్రిడ్జి నుంచి రెండు రకాల మత్తు పదార్థలను సేకరించారు పోలీసులు, వాటిలో ఒకటి వైన్‌లో కలిపేది కాగా.. రెండోది సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్‌లో మిక్స్ చేసేది అని కోర్టు తెలిపారు. ఇదిలా ఉండగా బాలేష్ తరపున వాదిస్తున్న న్యాయవాది మాత్రం తన క్లయింట్‌పై ఫిర్యాదు చేసిన మహిళలు అంతా పరస్పర అంగీకారంతోనే సెక్సులో పాల్గొన్నాడని వాదించారు. అలాగే బాలేష్ మహిళలకు మత్తు మందు ఇవ్వలేదని, మహిళల అంగీకారంతోనే రికార్డు చేశాడని వాదించారు.
ఇదిలా ఉండగా గత వారం కోర్టులో వాదనలు జరిగినంత సేపు ఆయన తన లాయర్ వెనుక మౌనంగా కూర్చున్నాడు. కోర్టులో బాలేష్ తన అపార్టుమెంటులో సెక్యువల్ యాక్ట్ మొత్తాన్ని కోర్టులో ప్రదర్శించారని సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. ఈ వీడియోలు చూసిన జడ్జిలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.