Site icon Prime9

South Africa: దక్షిణాఫ్రికాలోని ప్లాటినం గనిలో ప్రమాదం.. 11 మంది మృతి

South Africa

South Africa

South Africa: దక్షిణాఫ్రికాలోని ప్లాటినం గనిలో కార్మికులను తీసుకెళ్తుండగా ఒక ఎలివేటర్ అకస్మాత్తుగా 200 మీటర్లు (656 అడుగులు) కిందకు పడిపోవడంతో 11 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని గని ఆపరేటర్ మంగళవారం తెలిపారు.ఉత్తర నగరంలోని రస్టెన్‌బర్గ్‌లోని గనిలో కార్మికుల షిఫ్ట్ ముగింపులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద కారణాలపై దర్యాప్తు..(South Africa)

ఇంపాలా ప్లాటినం హోల్డింగ్స్ (ఇంప్లాట్స్) సీఈవో నికో ముల్లర్ ఒక ప్రకటనలో ఇంప్లాట్స్ చరిత్రలో ఇది చీకటి రోజని అన్నారు. ఎలివేటర్ పడిపోవడానికి కారణమేమిటనే దానిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించబడిందన్నారు. గని మంగళవారం అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపారుగాయపడిన వారిలో కొంతమందికి తీవ్రమైన కాంపాక్ట్ ఫ్రాక్చర్లు ఉన్నాయని ఇంప్లాట్స్ ప్రతినిధి జోహన్ థెరాన్ తెలిపారు. ఎలివేటర్ షాఫ్ట్ నుండి సుమారు 200 మీటర్ల దిగువకు పడిపోయిందని ఆయన చెప్పారు. ఇది అత్యంత అసాధారణమైన ప్రమాదమని ఆయన అన్నారు.దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాటినం ఉత్పత్తిదారు కావడం విశేషం.

2022లో దేశంలో జరిగిన అన్ని మైనింగ్ ప్రమాదాల నుండి 49 మరణాలు సంభవించాయి. అయితే అంతకు ముందు సంవత్సరం జరిగిన 74 ప్రమాదాలతో పోల్చితే ఇవి తగ్గినట్లే. దక్షిణాఫ్రికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దక్షిణాఫ్రికా మైనింగ్ ప్రమాదాల మరణాలు గత రెండు దశాబ్దాలలో క్రమంగా తగ్గాయి.

Exit mobile version