Site icon Prime9

Yoga: యోగాకు ముందు, తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Yoga

Yoga

Yoga: యోగా వల్ల ఎన్నో లాభాలున్నాయి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా తయారవ్వవచ్చు. యోగాను రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు, శరీరం రెండూ ఎంతో ప్రశాంతగా, ఆరోగ్యంగా ఉంటాయి. యోగా చేయటం వల్ల మనలో ఉండే ఆందోళన, ఒత్తిడి తొలగిపోతాయి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం యోగా మాత్రమే కాకుండా యోగ చేయటానికి ముందు , ఆ తర్వాత కూడా తప్పనిసరిగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మన శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. యోగా తర్వాత కొన్ని ఆహారపదార్ధాలను తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది.

 

 

తేలికగా జీర్ణమయ్యే..(Yoga)

యోగా చేస్తున్న సమయంలో మన శరీరం అధిక మొత్తంలో క్యాలరీలను కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి పొటాషియం, మెగ్నీషియం మొదలైన ఖనిజ లవణాలు అవకాడొలో పుష్కలంగా ఉంటాయి.

ఈ పోషకాలు శరీరంలోని కండరాలు, కణాల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి.

అంతేకాకుండా అవకాడొ తేలికగా జీర్ణమవడంతో పాటు ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. ఆవకాడొ లోని ఆరోగ్యవంతమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.

ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి యోగ సాధనకు తగినట్టు శరీరం సహకరించడం కోసం అవకాడొ తీసుకుంటే మంచిది.

అరటి పండులోని పొటాషియం నిల్వలను బట్టి ఎలాంటి వర్కవుట్స్ ముందైనా తినదగన పండుగా అరటిపండు.

కడుపు ఉబ్బరం, కండరాల నొప్పులను అరటిపండు నివారిస్తుంది కాబట్టి యోగాకు ముందు అరటిపండును నేరుగా లేదా స్మూదీ రూపంలో తీసుకోవచ్చు.

యాపిల్‌ లో క్షార గుణం కలిగి ఉంటుంది. కడుపులో ఆమ్లత్వం ఏర్పడకుండా చేస్తాయి.

సహజమైన చక్కెరలు, పీచు యాపిల్స్ లో ఎక్కువ. విటమిన్‌ సి, నీరు కూడా వీటిలో ఎక్కువే కాబట్టి యోగా చేసేటప్పుడు దాహాన్ని అరికట్టగలుగుతాయి.

విటమిన్‌ సి శరీరానికి చురుకుదనాన్ని అందించి, సాధనకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

 

 

ఆరోగ్యవంతమైన కొవ్వులు ఉండేలా..

యోగాకు మందు నాలుగు బాదం పప్పులు తింటే, శరీరానికి తక్షణమే శక్తి వస్తుంది. నీళ్లలో నానబెట్టినవి మాత్రమే తీసుకోవడం మంచిది. ఆర్గానిక్‌ బాదం పప్పుల్లో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యవంతమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

యోగా తర్వాత శరీరానికి అధిక కేలరీలు అవసరమవుతాయి. ఈ క్రమంలోనే అధిక కేలరీలు ఉండే పనీర్ తీసుకోవడం ఉత్తమం.

అదే విధంగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో పోషకాలు ఉండటం వల్ల తొందరగా శరీరానికి శక్తి అందుతుంది.

యోగా చేసిన తర్వాత ముఖ్యంగా చక్కెర, మాంసాహారాలకు దూరంగా ఉండటం మంచిది.

యోగా చేసే ముందు కూడా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా చేయాలనుకున్న రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.

అంతే తప్ప ఆహారం తీసుకున్న వెంటనే యోగా చేయరాదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

అదే విధంగా తీసుకునే ఆహార పరిమాణం విషయంలో ఖచ్చితమైన అవగాహన ఉండాలి.

 

Exit mobile version