Water For Health: ఆరోగ్యంగా ఉండాలంటే మన లైఫ్ స్టయిల్ సరిగా ఉండాలి. సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారంతో పాటు తాగే నీళ్ల పై కూడా శ్రద్ధ చూపాలి. శరీరానికి కావాల్పిన నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గురి కావడం ఖాయం.
చాలామంది నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల చాలా దుష్పరిణామాలు చవి చూడాల్సి ఉంటుంది.
మనిషి శరీరానికి మంచి నీరు చాలా అవసరం. శరీరం డీ హైడ్రేటెడ్ కాకుండా ఉండటానికి నీరు అత్యంత ప్రధానం.
కానీ మంచినీరు తాగేందుకు ఒక పద్దతి ఉంటుందని తెలుసా.. నీళ్లు ఎలా పడితే అలా తాగినా అది శరీరానికే ప్రమాదమంటున్నారు నిపుణులు.
నీటిలో ఎలాంటి కేలరీలు, పిండి పదార్థాలు లేవు, కనుక నీరు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి డ్రింక్. అంతేకాకుండా, నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జీవనశైలి మార్పులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, చేయడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటితో పాటు నీటి తీసుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
భోజనానికి ముందు.. తర్వాత(Water For Health)
ఉదయం లేవగానే నీళ్లను తాగితే శరీరంలోని అవయాలన్నీ ఉత్తేజితమవుతాయి. నీరు తీసుకోవడం వల్ల ఎక్సర్ సైజు చేసిన తర్వాత వచ్చే అలసట నుంచి శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
ప్రతి భోజనానికి అరగంట ముందు నీటిని తాగడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
అనారోగ్యంగా ఉన్నపుడు వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు కాపాడుతుంది.
రాత్రి పడుకునే ముందు నీరు తాగడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందినట్టు అవుతుంది.
స్నానం చేసే అరగంట ముందు నీరు తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
నీరు శాతం ఎక్కువగా ఉండే ఆహారం
చాలామంది పండ్ల రసాలు తీసుకుంటూ .. నీరు తాగడం మర్చిపోతుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. నీటిని మాత్రం క్రమం తప్పకుండా తీసుకుంటూనే ఉండాలి.
ఉడకబెట్టిన పులుసు, సూప్ లు, టమాటాలు, పుచ్చకాయలు లాంటి వాటిలో నీటి శాతం ఎక్కుండా ఉంటుంది. ఇటువంటి వాటిని తీసుకోవడమే కాకుండా నీరు తాగడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
వెంట నీరు ఉండేలా
బయటికి వెళ్లినా, ప్రయాణిస్తున్నా, ఇంట్లో, పనిలో ఉన్నా నీరు దగ్గర ఉండేలా చూసుకోండి. ఒక నీటి బాటిల్ ను వెంట పెట్టుకుంటే నీరు తాగడం సులభం అవుతుంది. నీటి బాటిల్‌ను దగ్గర ఉంచుకోవడం వల్ల ఎక్కువ నీరు తాగేందుకు అవకాశం ఉంటుంది.
రిమైండర్స్ సెట్ చేసుకోవడం
నీటిని క్రమం తప్పకుండా తాగే విధంగా రిమైండర్‌లను కూడా సెట్ చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ యాప్‌లో, అలారం సెట్ చేయడం వల్ల నీరు తాగడం మర్చిపోయినా… ఆ డివైజ్ లు గుర్తుచేస్తాయి.
ప్రతి 30 నిమిషాలకు నీరు తాగాలనే అలారాన్ని సెట్ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఇలాంటి పద్దతులు తప్పనిసరి.
నీటికి రుచిని కలిపి
నీరు ఎక్కువగా తాగడం ఇష్టం లేని వాళ్లు ఇష్టమున్న ప్లేవర్ ను కలుపుకోవచ్చు. దోసకాయ, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివి ఇన్ఫ్యూజర్ బాటిల్‌లో పండ్ల ముక్కలను వేసుకుని ఆ నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
టార్గెట్ పెట్టుకోవడం
ప్రతిరోజూ తీసుకోవాల్సిన నీటి పరిమాణంపై లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఇది కొత్తలో కాస్త ఇబ్బందిని అనిపించినా, తర్వాత మంచి ప్రయోజనాలనే అందిస్తుంది.
రోజులో ఎన్ని గ్లాసుల నీటిని తాగాలనే లక్ష్యం పెట్టుకోవడం వల్ల శరీరంలో అనేక రోగాలను నయం చేస్తుంది.