Banana: సామాన్యులకు అందుబాటులో ఉండే పండు అరటి. అరటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండును రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ అరటిని తినే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంట. ఒకవేళ ఆ నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుందో అసలు ఎందుకు అరటితో కలిపి ఆ పదార్థాలను తినకూడదో ఓ సారి తెలుసుకుందాం.
అరటిపండు తినన్నప్పుడు, తర్వాత కొన్ని పనులు చేయొద్దొన్ని ఆయుర్వేదం చెబుతోంది. అలా చెయ్యడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటుంది. ఏదైనా పండు తిన్న వెంటనే నీరు తాగొద్దొని చెబుతున్నారు. ఈ నియమం అరటిపండ్లకి కూడా వర్తిస్తుంది. అరటిపండు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలొస్తాయి. అరటిపండు తిన్న గంట తర్వాత మాత్రమే నీరు, డ్రింక్స్ తీసుకోవాలి. అలాగే రాత్రిపూట అరటి పండును తినొద్దు. ఇలా రాత్రుళ్లు పండ్లను తినడం వల్ల గొంతులో కఫం చేరుతుందని భావిస్తారు. అందుకే రాత్రిపూట ఆహారం తీసుకుంటే కఫం, దగ్గు, ఛాతీలో నొప్పి వంటి రావొచ్చు. పాలతో కలిపి కూడా అరటిపండు తీసుకోకూడదు. అరటిపండుతో చేసిన షేక్స్ తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం, నిజానికి అరటిపండ్లు, పాలు, పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కఫ దోషం పెరుగుతుందని విశ్వసిస్తారు. అలాగే జీర్ణక్రియ సమస్యలొస్తాయని, చర్మ సమస్యలకి కారణమవుతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణలు.
పెరుగుతో అరటి
ఇదిలా ఉంటే అరటిపండును పెరుగుతో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆహార నిపుణులు అంటున్నారు. మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు కూడా ఈ రెండు పదార్థాలు ఏంతో మేలు చేస్తాయని అంటున్నారు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదనంగా, ఇందులో విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు కూడా ఉన్నాయి. అరటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ ఉన్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అల్పాహారం సమయంలో ఈ రెండు ఆహారాలను తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. అల్పాహారంలో అరటిపండు, పెరుగు చేర్చడం వల్ల మీ ఎముకలు దృఢంగా ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు.
బెనెఫిట్స్
లైంగిక శక్తి పెరగడం
కండరాల బలం
ఆకలి నియంత్రణ
రుచి
మూత్ర సమస్యల నుంచి ఉపశమనం