Site icon Prime9

Summer Tan: సమ్మర్ లో చర్మం ట్యాన్ కాకుండా ఉండాలంటే..?

Summer Tan

Summer Tan

Summer Tan: వేసవి కాలంలో తీవ్ర ఎండల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంటుంది. దానికి కారణం శరీరానికి కావాల్సిన నీరు అందకపోవడం. మరి డీ హైడ్రేషన్ నుంచి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి.. దాంతో పాటు శరీరం ట్యాన్ కాకుండా చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి.

చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య స్కిన్ ట్యాన్. మామూలుగా ఎండలోకి వెళ్తే చర్మం నల్లబడటం గమనిస్తూ ఉంటాం. కానీ వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువ.

అయితే ఎన్ని చిట్కాలు ప్రయత్నించినా శరీరంపై సన్ బర్న్, ట్యాన్ లాంటివి కనిపిస్తూనే ఉంటాయి.

వాటి కోసం కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఇంకా సమస్యలు పెరగడమే తప్ప ఉపయోగం ఉండదు.

కాబట్టి ఇంట్లో దొరికే పదార్థాలను ఉపయోగించి ఈ సన్ ట్యాన్ ను తొలగించుకునే వీలుంది.

ఎండకు వెళితే చాలామంది చర్మం ట్యాన్ అవుతుంటుంది. దీనికి కారణం చర్మంలో ఉండే మెలనిన్ అనే పదార్థం.

ఎండ తగిలినప్పుడు మెలనిన్ బ్రౌన్ కలర్ లోకి మారి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఎక్కువగా ఎండలో తిరిగితే స్కిన్ ట్యాన్ అవుతుంటుంది. దీనిని నివారించాలంటే సన్ స్క్రీన్లను వాడటం,

బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు అద్దాలు, తలకు టోపీ వాడటం లాంటివి చేయాలి.

Effective Home Remedies To Remove Skin Tan

ఇంట్లో దొరికే వాటితోనే (Summer Tan)

చర్మాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అదే పెరుగు ట్యాన్ ను కూడా తొలగిస్తుంది. నల్లబడిన భాగాల్లో పెరుగును రాసి 15 నుంచి 20 నిమిషాల కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

కలబంద శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. పిగ్మంటేషన్ తగ్గించేందుకు కూడా కలబంద బాగా ఉపయోగపడుతుంది.

ఇందులోని యాంటీ ఇన్ ఫ్లేమటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.

కాబట్టి కలబందను ఉపయోగించడం వల్ల చర్మం డీటాన్ కావడం మాత్రమే ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.

ఇంట్లో రోజూ వాడే టమాటా వల్ల కూడా చర్మంపై ట్యాన్ ను పొగొట్టుకోవచ్చు.

నల్లబడిన భాగాల్లో టమాటా ముక్కలతో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి.. ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

డీహైడ్రేషన్ కాకుండా తగిన ఆహారం

అదే విధంగా ఎండాకాలంలో ఉండే వాతావరణానికి తగ్గట్టుగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వేసవిలో జీలకర్ర వాడకాన్ని పెంచడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. మజ్జిగలో జీలకర్ర పొడిని కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోవడంతో పాటు శరీరం చల్లబడుతుంది.

వేసవి ఉష్ణోగ్రతలను మన శరీరం తట్టుకోవడం కోసం చెమటను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది.

దీని వల్ల శరీరంలో వివిధ రూపాల్లో తీసుకునే నీటి శాతంలో అధిక భాగం చెమట ద్వారా బయటకు పోతుంది.

ఫలితంగా త్వరగా డీహైడ్రేషన్ అవుతుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి మెంతులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు.

అలాగే శరీరానికి నీరు ఎక్కువగా అందేలా జాగ్రత్త పడాలి. నేరుగా నీటిని తీసుకోవడమే కాకుండా..

వివిధ పండ్లు, కూరగాయలు, జ్యూసుల రూపంలో శరీరానికి ద్రవపదార్థాలు అందేలా చూసుకోవాలి.

వేసవిలో పుచ్చకాయను తరుచూ తీసుకోవాలి. అలాగే బత్తాయి పండ్లు, కీరా, దోసలను తింటూ ఉండాలి.

సొరకాయ, బీరకాయలాంటి కూరగాయలను ఎక్కువగా తింటే డీహైడ్రేషన్ నుంచి రక్షణ లభిస్తుంది.

Exit mobile version
Skip to toolbar