Site icon Prime9

Summer Face Packs: ఈ న్యాచురల్ ప్యాక్స్ తో జిడ్డు, చెమటకు చెక్ పెట్టండి

Summer Face Packs

Summer Face Packs

Summer face Packs: ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎండవేడిమి కారణంగా విపరీతంటా చెమటలు పట్టి చాలా చిరాకుగా ఉంటుంది. ఈ వేసవిలో ఎన్ని సార్లు ముఖం కడిగినా ప్రెష్ నెస్ కనిపించదు. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. కాబట్టి ఈ వేడికి జిడ్డు, చెమట లాంటి వాటి నుంచి ఉపశమనం కలగాలంటే.. ఈ చిట్కాలు ప్రయత్నించండి. ఇందుకోసం ఇంట్లో ఉండే సహజ పద్దతులే సరిపోతాయి.

 

చక్కెరతో స్క్రబ్(Summer Face Packs)

వేసవిలో ముఖ్యంగా రోజులో కనీసం రెండు మూడు సార్లు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంధ్రాల నుంచి ఎక్కువ చెమట పట్టకుండా ఉంటుంది. సమ్మర్ లో కోల్డ్ వాటర్ ఎక్కువగా ఉపయోగించి ముఖం శుభ్రపరుచుకోవడం వల్ల సహజంగా హీట్ తగ్గించుకోవచ్చు. ముఖంపై చెమటను కూడా తగ్గించుకోవచ్చు .

అదే విధంగా కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ని ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

చర్మంపై ఉండే మృతకణాలను తొలగించేందుకు చక్కెరతో స్క్రబ్ ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. దీని తయారీకి చక్కెర, ఆలివ్‌ నూనెల్ని సమానంగా తీసుకుని ముఖానికి రాసి.. మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది.

సహజ టోనర్‌గా

తేనె, నిమ్మ రసాలను సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా మారుస్తుంది. నిమ్మరసంలో ఉండే సి విటమిన్‌ చర్మాన్ని కాంతి వంతంగా కనిపించేలా చేస్తుంది.

సాధారణంగా రోజ్‌వాటర్‌ సహజ టోనర్‌గా ఉపయోగపడుతుంది. ఇది చర్మ పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తుంది. ఫేస్‌ ప్యాక్‌లు పూర్తయ్యాక రోజ్ వాటర్ ను రాస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

అదే విధంగా రాత్రి నిద్రపోయే ముందు కీరదోసకాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల అధిక చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి సీజన్ లో రాత్రుల్లో ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే అదనపు చెమట నుండి ఉపశమనం పొందవచ్చు

స్కిన్ సమస్యలను

వేసవిలో ముఖానికి చెమటలు పట్టకుండా ఐస్ క్యూబ్స్ బాగా ఉపయోగపడతాయి. గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన క్లాత్ లో చుట్టాలి. తర్వాత ముఖం మీద రుద్దుకోవాలి. ఈ పద్దతిని తరచూ అనుసరిస్తుంటే ఎఫెక్టివ్ గా ముఖంపై చెమటలను నివారించుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కలైన్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది మంచి బెనిఫిట్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం పై అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడుతాయి. స్కిన్ సమస్యలను నివారించుకోవచ్చు.

Exit mobile version