Sleepiness After Lunch: మధ్యాహ్న భోజనం తిన్నాక నిద్ర మత్తుగా ఉంటుందా..?

Sleepiness After Lunch: మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలామందిలో నిద్రమత్తుగా (Sleepiness) అనిపించడం తెలిసిందే. కొందరికి కాస్త కునుకు తీస్తే గానీ పని జరగదు. కానీ అందరికీ ఆ అవకాశం కుదరక పోవచ్చు. ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు.

అయితే ఎప్పుడో ఒకసారి నిద్రమత్తు వస్తే పర్వాలేదు కానీ ప్రతి రోజు ఈ సమస్య వస్తే మాత్రం పనిపై ప్రభావం పడుతుంది. ఇంతకీ మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్న తర్వాత ఎందుకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది? దానికి కారణమేంటి? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలి?

నిద్రమత్తు కు కారణం

అన్నం తిన్న వెంటనే నిద్రమత్తు కు ప్రధాన కారణం అన్నంలోని గ్లూకోజు వేగంగా రక్తంలో కలవడం. అంతేకాకుంగా అన్నంతో మైండ్ రిలీఫ్ అయ్యే మెలటోనిస్, సెరటోనిన్ వంటి హార్మోన్లూ విడుదల అవుతాయి.

వాటి వల్ల ఒకలాంటి మత్తు , రెస్ట్ నెస్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఒక్క అన్నంతో మాత్రమే ఈ సమస్య ఉండదు. చాలా రకాల పిండి పదార్ధాలతోనూ ఇలాగే అనిపిస్తుంది.

మధ్యాహ్నం మత్తుకు మరో కారణం లేకపోలేదు. మామూలుగా మెదడులోని అడెనోసిన్ అనే రసాయనం ఉత్పత్తి చెందడం వల్ల నిద్ర వస్తుంది.

అయితే రాత్రి నిద్ర పోయే సమయానికి ముందు ఈ రసాయన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఈ రసాయనం ప్రభావం కొంతమేర ఉంటుంది.

అందుకు కారణం మధ్యాహ్నం మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.

బ్రేక్ చేయండిలా..

ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మధ్యాహ్నం వచ్చే నిద్రమత్తు(Sleepiness) ను బ్రేక్ చేయవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఆహారంలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్స్ లైట్ గా ఉండటంతో పాటు అవి తీసుకోవడం వల్ల డోపమైన్, ఎపినెఫ్రిన్ వంటి రసాయనాలు విడుదలై శరీరానికి ఎక్కువగా శక్తి లభిస్తుంది.

కొంతమంది అన్నం తినకుండా ఉండలేరు. అలాంటి వాళ్లు మామూలు బియ్యం కంటే పొడవైన బాస్మతి రైస్ వాడుకోవచ్చు.

వీటిలోని గ్లూకోజు అంత త్వరగా రక్తంలో కలవదు. అయితే, అది కూడా ఎక్కువగా కాకుండా.. ఒక లిమిట్ లో తీసుకోవడం మంచిది.

అదేవిధంగా చిరుధాన్యాల ఆహారం తీసుకోవచ్చు. సజ్జ, జొన్న, రాగి, గోధుమలతో రొట్టెలు కూడా ప్రయత్నించవచ్చు. పనీర్, సోయాతో వంటలు కూడా ట్రై చేయోచ్చు.

నాన్ వెజ్ తినాలను కుంటే వెజ్ టేబుల్ సలాడ్ తో కలిపి ఉడికించిన చికెన్ ను తీసుకున్నా సరిపోతుంది.

మధ్యాహ్నానికి శరీరంలో శక్తి తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ క్యాలరీలు ఎక్కువగా శక్తి నిచ్చే ఆహారం తీసుకోవడం ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

అదే విధంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తీసుకోవాలి.

వర్క్ ఫ్లేస్ లో ఎప్పుుడూ కుర్చిలో ఉండకుండా అప్పుడప్పుడు లేచి నాలుగు అడుగులు వేస్తూ ఉండాలి. చాలా మంది పని బిజీలో పడి కూర్చున్న ప్లేసు నుంచి లేవరు.

కనీసం గంటకు ఒకసారి అయినా లేచి నడవాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయబం ఒకింత బద్దకం, నిద్రమత్తు కూడా వదులుతుంది.

నిద్రమత్తు పోవడానికి మ్యూజిక్ ఎంతో ఉపయోగపడుతుంది. నచ్చిన సాంగ్స్ వినడం వల్ల మెదడు యాక్టివ్ అయి నిద్ర మత్తు పరార్ అవుతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/