Site icon Prime9

Skipping Breakfast: ఉదయం టిఫిన్ తినకపోతే ఏమవుతుంది?

break fast

break fast

Skipping Breakfast: చాలామంది ఉదయం అల్పా హారాన్ని తీసుకోవడంలో అశ్రద్ధ చూపుతారు. దానికి జనరల్ గా చెప్పే కారణం టైం లేకపోవడం.. కానీ ఉదయం టిఫిన్ తినకపోతే ఏమవుతుంది.

రోజంతటికీ కావాల్సిన శక్తి అందదు. ఈ క్రమలో నీరసం, నిస్సత్తువ వస్తాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందించే అల్పాహారాన్ని మానేడయం సరైనది కాదంటున్నారు నిపుణులు

పని హడావుడిలో సమయం లేదు. డైట్ లో ఉన్నాను.. బరువు తగ్గాలి..కారణమేదైనా టిఫిన్ మానేస్తుంటారు. లేకపోతే చాలా ఆలస్యంగా తింటారు.

వీటి వల్ల అదనపు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

బరువు తగ్గాలంటే టిఫిన్ మానేయలనుకుంటారు కొందరు. నిద్రలోనే చాలా గంటలు గడిచి పోతాయి. మామూలుగా కంటే కూడా ఎక్కువగా టైం ఫుడ్ తీసుకోము.

ఆ గ్యాప్ ఎక్కువ అయితే మెటబాలిజం దెబ్బ తింటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోవడం, తలనొప్పి లాంటివి వస్తాయి. ఒత్తిడిలో కొంతమంది అతిగా తింటుంటారు.

ఆ సమస్య ఉదయం అల్పాహారం తినే వారిలో కనిపించదు.

ఉదయం నిద్రలేచిన గంట లోపల టిఫిన్ తినలంటున్నారు నిపుణులు. అది కూడా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో నిండి ఉండాలి.

తెల్లవారే వరకు ఏమీ తినం కాబట్టి రాత్రి భోజనం ఎక్కువ తినేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది సరైనది కాదు.

ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకోవచ్చు గానీ రాత్రి తీసుకునే ఎప్పుడూ తేలికగా ఉండాలి.

ఈ కాలంలో కొంతమంది హెల్త్ అని చెప్పి ఉదయం ఎక్కువగా స్మూతీలు తీసుకుంటున్నారు. కానీ అది కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు.

స్మూతీలతో మెటబాలిజంలో మార్పులొస్తాయి. చక్కెర స్థాయిలు పడిపోతాయి. పండ్లు, కొంచెం ప్రోటీన్ ఫుడ్ ని యాడ్ చేసుకోవాలి.

 

టిఫిన్ తీసుకోకపోతే..

దాదాపు 12 గంటల విరామం తర్వాత శరీరానికి అందించే అల్పాహారం జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది.

ఈ గ్యాప్ పెంచినా లేదా పూర్తిగా దాటవేసినా కూడా జీవక్రియల వేగం క్రమేపీ తగ్గిపోతుంది. కెలోరీలను ఖర్చు చేసే శక్తిని నెమ్మదిగా శరీరం కోల్పోయి.. కొవ్వు పెరుగుతుంది.

అల్పాహారాన్ని తీసుకోని వారిలో కన్నా తినే వారిలో జీవక్రియల వేగం అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

శరీరంలోని చక్కెర స్థాయులను అల్పాహారం బ్యాలెన్స్ చేస్తుంది. లేదంటే మైగ్రేన్‌ సమస్య, రక్తపోటు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

ప్రొటీన్ల శాతం తగ్గడంతో శరీరంలోని కెరొటిన్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

దీంతో శిరోజాల పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో జుట్టు రాలుతుంది.

అల్పాహారం తీసుకోకపోవడంతో కొవ్వు స్థాయులు పెరిగి అధిక బరువు సమస్య వస్తుంది.

10 Side Effects of Skipping Breakfast - Zubica

ఎలాంటి టిఫిన్ లు తీసుకోవచ్చు

ఈజీగా చేసుకుని తినగలిగే వాటిని ప్రయత్నించండి. అంతేకాకుండా ఆ అల్పాహారం ప్రయోజనాలు కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది.

సూపర్ ఫుడ్ అంటే మాత్రం మొదట గుర్తేచ్చేది ఎగ్స్. వ్యాధి కారకాలతో పోరాడే పోషకాలున్న అతి శక్తివంతమైన అల్పాహారం. ఒక గుడ్డు నుంచి దాదాపు 7 గ్రాముల ప్రోటీన్ , 75 క్యాలరీలు వస్తాయి.

ఆకుకూరలతో కలిపి ఆమ్లెట్ గా.. ఉడికించి నచ్చిన విధంగా తీసుకోవచ్చు.

ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. మన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్ ను అంతం చేస్తాయి. పెరుగులోని ప్రొబయోటిక్స్ , పీచు, పాలీఫినాల్స్ జీర్ణక్రియకు తోడ్పడతాయి.

అదేవిధంగా పెరుగులో ఎక్కువగా ప్రొటీన్ లు ఉంటాయి.

అందరికీ బాగా నచ్చే ..దోశ, ఇడ్లీలలో కూడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ టిఫిన్ లు త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా రోగనిరోధక శక్తిని ఇస్తాయి.

ఈ పిండి పులవడం వల్ల వచ్చే ప్రొబయోటిక్స్ క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయి.

ఓట్స్ తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫిలింగ్ కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. శరీరానికి కావల్సిన పోషణ, శక్తి కూడా అందుతాయి. ఒట్స్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar