Site icon Prime9

Pistachios: రోజూ గుప్పెడు పిస్తా తింటే.. ఆరోగ్యం మీ గుప్పిట్లోనే

Pistachios

Pistachios

Pistachios: రుచికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది పిస్తా పప్పు. రోజా వారి డైట్ లో చాలామంది పిస్తా పప్పులను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ అలవాటు మంచిదే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. పిస్తా కేవలం రుచికే కాకుండా.. మంచి బలమైన ఆహారమని సూచిస్తున్నారు. ఇందులో ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లు ఉంటాయి. బరువు తగ్గడం కోసం, గుండె ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యానికి పిస్తా పప్పు ఎంతో ఉపయోగపడుతుంది. పిస్తా లో పొటాసియం అత్యధికం గా లబిస్తుంది. శరీరంలో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బీ6 ప్రోటీన్ల తయారీ , శోషణంలో ఉపయోగపడుతుంది . మిగిలిన డ్రై ఫూట్స్ తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ ఉంటాయి.

పిస్తాతో ఆరోగ్య ప్రయోజనాలు(Pistachios)

పిస్తా ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పిస్తా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు కారణం వాటిలోని ఎల్-అర్జినైన్ భాగం. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌గా మారినప్పుడు రక్తప్రసరణకు సహాయపడుతుంది.

పిస్తా పప్పు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పిస్తాలు ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారికి మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గింజల్లో పిస్తా ఒకటి. కంటి ఆరోగ్యానికి తోడ్పడే రెండు పోషకాలైన లుటీన్, జియాక్సంతిన్ లు ఇందులో అధిక స్థాయిలో ఉంటాయి. శరీరంలో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది.

ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అనే పోషకాలు పిస్తాలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, విటమిన్ B6 ఖనిజాలతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పిస్తా బాగా పనిచేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. పిస్తా లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

పిస్తాలో ఉండే ఎక్కువ ఫైబర్, ప్రొటీన్ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ రావడంతో పాటు తక్షణ శక్తి వస్తుంది. తక్కువగా తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవడంలో ఉపయోగపడుతుంది.

ఒత్తిడి తగ్గించి.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బీ6 అధికంగా లభించే ఆహార పదార్థాల్లో పిస్తా ఒకటి. కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు.

 

ఔన్సు పిస్తాలో పోషకాలు(ఔన్సు అంటే 28 గ్రాములు)

క్యాలరీలు 159
కార్బోహైడ్రేట్లు 8 గ్రాములు
ఫైబర్ 3 గ్రాములు
ప్రొటిన్ 6 గ్రాములు
ఫ్యాట్ 13 గ్రాములు
పొటాషియం 6 శాతం
ఫాస్పరస్ 11 శాతం
విటమిన్ బీ6 28 శాతం
థయామిన్ 21 శాతం
మెగ్నీషియం 15 శాతం

 

 

Exit mobile version