Site icon Prime9

Phool Makhana: కొలస్ట్రాల్, షుగర్‌, బీపీ ఇంకా.. పూల్ మఖ్ నా ట్రై చేయండి

Phool Makhana

Phool Makhana

Phool Makhana: పూల్ మఖ్‌నా, తామర గింజలు, ఫాక్స్‌ నట్‌, లోటస్‌ సీడ్‌.. ఇలా రకరకాల పేర్లండే వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు మాత్రం వెల కట్టలేనివి ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతో పాటు మఖ్ నా లో ఔషధగుణాటు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

వీటిలో ఎముకలకు మేలు చేసే కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి తామర గింజలను డైట్ లో చేర్చుకుని మంచి ఫలితాలు పొందవచ్చు.

 

మరెన్నో ప్రయోజనాలు(Phool Makhana)

వీటిలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. కాబట్టి భోజనానికి, భోజనానికీ మధ్యలో కూడా ఇవి తినొచ్చు.

మఖ్ నా లో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ. కాబట్టి రక్తపోటు ఉండే వాళ్లు ఇవి తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.

మెగ్నీషియం శరీరంలోని రక్తం, ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వీటిలో చక్కెర చాలా తక్కువగా ఉండటం వల్ల .. తరచుగా ఆకలితో బాధపడే మధుమేహులకు ఇది చక్కని స్నాక్.

పీచు ఎక్కువ కాబట్టి మలబద్ధకం ఉన్నవాళ్లు వీటిని తప్పక తినాలి.

 

—————————————————————-

తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువగానే ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు దూరం చేయాలనుకుంటే ఈ సీడ్స్ తరచుగా తింటూ ఉండాలి.

ఈ విత్తనాలకు పునరుత్పత్తి సమార్ధ్యాన్ని పెంచే గుణం ఉంటుంది. కాబట్టి అండాలు విడుదల అవని మహిళలు ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

నిద్రలేమి ఉన్నవాళ్లకు ఫాక్స్‌ నట్స్‌ బాగా ఉపయోగపడతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

కాఫీ అడిక్షన్‌ ఉన్నవాళ్లు.. ఆ అలవాటును పోగొట్టుకోవాలనుకుంటే.. కాఫీ తాగాలనిపించినప్పుడు వీటిని తింటూ ఉండాలి.

 

Exit mobile version