Moringa: మునగ చెట్టు అంటే కేవలం మునగకాడలే అనుకుంటారు. కానీ వాటికంటే మునగాకులోనే ఎక్కువ పోషకాలున్నాయి. రుచికి రుచితో పాటు పోషకాలను అందించడంలో మునగాకు చాలా ప్రత్యేకమైంది. మన చుట్టూ ఉన్న అనేక ఆకుకూరలు, కాయగూరలు అద్భుత ఔషధాలు. అయితే వాటిని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మునగాకుతో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
మునగాకు తింటే ఎముకలు బలపడతాయి. రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.. ఇలా ఈ ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకారనిపుణులు. మునగాకులో బీటా కెరెటిన్ అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ ఆకుల నుంచి ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఒకటా రెండు ఏకంగా 300 వ్యాధులకు చెక్ పెట్టే విటమిన్లు, పోషకాలు ఈ ఆకులో ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు.
రక్తహీనతను అరికట్టేందుకు(Moringa)
మునగాకులో కాల్షియం, ఫాస్పరస్ లు ఉంటాయి. పాలతో పోలిస్తే మూడు వంతుల అధిక క్యాల్షియం ఇందులో ఉంటుంది. 100 గ్రాముల మునగాకులో దాదాపు 400 మైక్రోగ్రాముల క్యాల్షియం అందుతుంది. కూర, పప్పు , వేపుడు, పొడి.. ఇలా వివిధ రకాలుగా మునగాకును రోజూ వారి ఆహారంలో తీసుకుంటే రక్తహీనత సమస్య ఎదురుకాదు.
మునగాకులోని పీచు పదార్థం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా కొవ్వును బయటకు పంపేలా చేస్తుంది. కాబట్టి ఊబకాయులు తమ ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు.
మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని కొన్ని నెలల పాటు తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయంట. థైరాయిడ్, ఎముకలను బలంగా చేయడంలో మునగాకు ఉపయోగపడుతుంది. మహిళలకు వచ్చే రుతు సంబంధిత ఇబ్బందులకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. మునగాకును రసాన్ని నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
చర్మవ్యాధులకు ఔషదంగా
మునగాకుని పొడిగా చేసుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు ముద్దలు తింటే మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. మునగాకు రసములో నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాసుకుంటే అవి తగ్గుతాయి.
మునగాకులోని ఫైటో కెమికల్స్, పాలీఫినాల్స్ శరీరంలోని మలినాలను బయటకు పంపించి రక్తంలోని ఫ్రీరాడికల్స్ ను నిర్మూలిస్తాయి.