Site icon Prime9

​Monsoon Health Care: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే

​Monsoon Health Care

​Monsoon Health Care

​Monsoon Health Care: వర్షాకాలం వచ్చేసింది. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మండే ఎండల నుంచి విముక్తి లభించిందనే చెప్పాలి. వర్షాకాలంలోని చిగురించే పచ్చని ప్రకృతి.. వర్షపు చినుకులు మనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఈ వర్షాకాలంలో మరో డేంజర్ ఉందడోయ్. సడెన్ గా వాతావరణం మారడం, వర్షంలో తడవడం, బురద నీటిలో తిరగడం వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతుంటాయి. ఈ కాలంలో ఆస్తమా, సైనస్‌ సమస్యలు ఉన్నవారి పరిస్థితి మరితం తీవ్రతరం అవుతుంది. తేమ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌ కూడా త్వరగా వృద్ధి అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి ఈ సీజన్‌లో అలెర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.. అలా ఇమ్యూనిటీని బూస్ట్‌‌‌ చేసే ఆహారాలు, డ్రింక్స్‌ ఏమిటో ఓసారి చూద్దాం.​

అల్లం
అల్లంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలెర్జీలతో బాధపడుతుంటే.. అల్లం ఎంతగానో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి.. అల్లం టీ తాగితే మంచిది.

సిట్లస్‌ పండ్లు
సిట్రస్‌ పండ్ల(నిమ్మకాయ, నారింజ, ఆరెంజ్, బత్తాయి)లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

​పసుపు
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి వివిధ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపులోని కర్కుమిన్‌ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పాలలో పసుపు వేసుకుని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

టమాటాలు
టొమాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, వీటిలో లైకోపీన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో వాపులను నివారించడానికి అరెర్జీలను తగ్గించడానికి టామాటాలు ఎంతగానో తోడ్పుడుతాయి.

ఉల్లిపాయలు
ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే బయోఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుంది. మీరు అలెర్జీలతో బాధపడుతుంటే.. యాంటిహిస్టామైన్లు సహాయపడతాయి.

Exit mobile version