Site icon Prime9

Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

lung cancer prime9news

lung cancer prime9news

Lungs Health: ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకొస్తుందంటే కణ విభజన,పెరుగుదల ప్రక్రియలు దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.అసాధారణమైన,అనియంత్రిత పెరుగుదలకి దారితీస్తుంది. కణాలు అభివృద్ది చెందుతున్నప్పుడు, కణితిని పోలి ఉండే కణాలు వృద్ధి చెంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఎక్కువ పొగ తాగడం వల్ల వస్తుంది. పొగ తాగని వారిలో 25 శాతం ఊపిరితిత్తులు క్యాన్సర్ వృద్ది చెందుతుంది. అరవై ఏళ్లు పై బడిన వారిలో ప్రతి నాలుగురులో ముగ్గురుకు లంగ్ క్యాన్సర్ వస్తుంది.

స్క్రీనింగ్ అవసరం..

స్క్రీనింగ్ చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే ఇది అన్ని ప్రయోజనాలను మనకు అందిస్తుంది. ఊపిరితిత్తుల స్క్రీనింగ్ చేసేటప్పుడు వాటిని మనం ముందే గుర్తించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చు. స్క్రీనింగ్ లో 80 శాతం లంగ్ క్యాన్సర్‌ వచ్చిన వారిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.

లంగ్ క్యాన్సర్ వల్ల మరణించే అవకాశం కూడా ఉంది. ముందస్తుగా ఈ వ్యాధి నిర్ధారణ చేశాక వాళ్ళని బ్రతికించే అవకాశం లేకపోలేదు. లంగ్ క్యాన్సర్‌ ఎక్కువుగా ఉన్న వారు వ్యక్తులు రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. అలాగే దీని లక్షణాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు తెలిసిన తరువాత క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ముందుగానే మనం ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. లంగ్ క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదం గురించి మీకు ఆందోళనగా ఉంటే ముందుగానే డాక్టర్స్‌ని సంప్రదించండి.

Exit mobile version