Intermittent Fasting: ప్రస్తుతం కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారు. రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు. నిపుణులు మాత్రం ఇది సరైన పద్దతి కాదని చెబుతున్నారు. బరువు తగ్గేందుకు భోజనం తగ్గించే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్లు కోరుతున్నారు. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన కాల నియంత్రిత డైట్.
ప్రస్తుతం కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారు. రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు. నిపుణులు మాత్రం ఇది సరైన పద్దతి కాదని చెబుతున్నారు. బరువు తగ్గేందుకు భోజనం తగ్గించే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్లు కోరుతున్నారు. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన కాల నియంత్రిత డైట్.
సాధారణంగా ఉపవాసం ఉండేవారు 16 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటారు. మిగతా 8 గంటల వ్యవధిలో భోజనం చేస్తారు. కానీ పద్ధతి.. కాలేయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించడం చాలా అవసరం.
ఉపవాసం అనేది ఇటీవలి కాలంలో ఒక ప్రసిద్ధ ఆహార ధోరణి. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపవాసం సహకరిస్తుంది. చాలా మంది సినీనటులు.. అడపాదడపా ఉపవాసం చేయడం ద్వారా బరువు తగ్గించుకుంటున్నారు.
ఉపవాసంలో వారానికి ఐదు రోజులు క్రమం తప్పకుండా తినాలి. ఇక మిగతా రెండు రోజుల్లో కేవలం కేలరీలు మాత్రమే తీసుకుంటారు. దీంతో పాటు.. ఎనిమిది గంటలు తినడం, 16 గంటల పాటు ఉపవాసం ఉంటారు.
కాలేయం మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. ఉపవాసం ఉన్న సమయంలో.. శరీరానికి ఇంధనంగా గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఉపవాస సమయంలో కీటోన్ ఉత్పత్తిలో, ఇది మెదడు , ఇతర అవయవాలకు శక్తిని అందిస్తుంది. కానీ దీర్ఘకాలిక ఉపవాసం కాలేయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.
దీనివల్ల ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది.
ఉపవాసం ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది.
కాలేయ వ్యాధి ముఖ్యంగా.. కొవ్వు, ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉంటుంది.
కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలు పెరగడం తరచుగా కాలేయం దెబ్బతినడం, వ్యాధికి సంకేతంగా చెప్పవచ్చు.
అడపాదడపా ఉపవాసం కాలేయ ఎంజైమ్‌లను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి.
ఇది మెరుగైన కాలేయ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అడపాదడపా ఉపవాసం ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది, ఇది కాలేయం దెబ్బతినకుండా చూస్తుంది.
ఎక్కువగా ఉపవాసం ఉండటం.. కాలేయ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదని నిపుణలు సూచిస్తున్నారు.
ఈ సమస్యతో బాధపడే వారు.. ఆహార మార్పులను ప్రయత్నించే ముందు వైద్యునితో సంప్రదించటం మంచిది.
ఉపవాసం కాలేయ ఆరోగ్యంపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
అడపాదడపా ఉపవాసం అన్నది ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో, కాలేయ ఎంజైమ్‌లను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.
అయితే ప్రత్యేకించి కాలేయ పరమైన సమస్యలు ఉన్నవారు ఆహార మార్పులు, ఉపవాసాల ఉండాలనుకునే ముందుకు వైద్యునితో మాట్లాడటం చాలా అవసరం.
ఇది సురక్షితంగా ఉండేందకు దోహదపడుతుంది.