Indian Spices: మనం ఆరోగ్యం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ డైట్.. ఈ డైట్ అంటూ పలు రకాల ఫుడ్ ను కూడా ఫాలో అవుతుంటాం. కానీ మన వంటిల్లే పెద్ద వైద్యశాల. అందులో దాదాపు మనం వాడే వస్తువులన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే.
మరీ ముఖ్యంగా వంటింట్లో ఉండే పోపుల పెట్టెలో కావాల్సినన్ని పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పోపుల పెట్టెలో ఉండే పదార్థాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టచ్చని సూచిస్తున్నారు.
కరోనా కాలంలో ఎన్నో వేరియంట్లు, మ్యూటేషన్లు అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గడం. అయితే వివిధ రకాల మందులు , ఇంజక్షన్లు, వ్యాక్సిన్స్ తో రోగనిరోధక శక్తి పెంచుకునే వీలు ఉంది.
అయితే వంటింట్లో ఉండే పోపుల పెట్టె వైద్యమే చాలా వరకు ఉపయోగపడింది. ఎన్నో మందులతో ఇమ్యూనిటీ పెంచుకున్నా.. మంచి ఆహారంతో వచ్చే రోగనిరోధక శక్తి తో సమానం కాదు కదా.
కాబట్టి పోపుల పెట్టెలోని చిన్న చిన్న పదార్థాలతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. మరి అవేంటో చూద్దాం.
పోపుల పెట్టెలో ఆవాలు , జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సెనగపప్పు, కందిపప్పు,వెల్లుల్లి, పసుపు, ఇంగువ, మెంతులు, ఎండుమిర్చి, వాము, లాంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి.
కోవిడ్ సమయంలో మిగతా దేశాల కంటే మన దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉండటానికి ఈ సుగంధ ద్రవ్యాల వాడటమే కారణమని పలు రీసెర్చ్ లు కూడా చెప్పాయి.
పసుపు : మన శరీరం లోపల ఎలాంటి వాపులు రాకుండా పసుపు చేస్తుంది. పసుపులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు రాకుండా కాపాడుతాయి. రక్తంలో చెడు కొవ్వు మోతాదును తగ్గించి గుండెజబ్బులు రాకుండా చూస్తుంది.ఇలా పసుపు ఎన్నో లాభాలు ఉన్నాయి.
మెంతులు: రుచికి చేదుగా ఉన్నా.. మెంతులు చేసే మేలు మాత్రం అధికం. శరీరంలో ఉండే అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
చాలామందికి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం చూస్తుంటాం.ఈ సమస్యను నివారించడానికి మెంతులు తోడ్పడతాయి.
జట్టు రాలకుండా కాపాడటమే కాకుండా.. ఒత్తుగా పెరిగేందుకు కూడా మెంతులు సహకరిస్తాయి.
జట్టుకు సంబంధించిన పోషకాలన్నీ మెంతుల ద్వారా అందుతాయి. తల్లిపాల ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి.
ఇంగువ: లో యాంటీ బ్యాక్టిరియల్ , యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
ఆస్తమాకి ఇంగువ దివ్వ ఔషదంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. ప్రతిరోజూ ఆహారంలో ఇంగువ చేరిస్తే గ్యాస్ సంబంధిత సమస్యలు దరిచేరవు.
మిరియాలు జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మెడిషన్. నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.
ఒత్తిడి, ఆందోళన లాంటి వాటి నుంచి దూరంగా ఉంచుతాయి.కూరలు, చారు, కిచిడీ ల్లో కారానికి బదులుగా మిరియాలు వాడి చూడండి.సీజనల్ వ్యాధుల సమస్యలు ఉండవు.
ఆవాలు : ఆవాల్లో కావాల్సినన్నీ విటమిన్లు, ఖనిజ లవణాలు.. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లాంటివి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం అజీర్తిని దూరం చేస్తుంది.
ఎముకలు, దంతాలు, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంపై ఏర్పడే కురుపులకు, దురదలకు ఆవాల పొడిని రాయడం వల్ల త్వరా ఉపశమనం కలుగుతుంది.
అంతేకాకుండా ఆవాలు పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి.
ధనియాలు : ధనియాల్లో విటమిన్లు ఎ, సీ, కె , ఫోలెట్ లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును పెంచడానికి, వాపును తగ్గించుకోవడానికి బాగా పనిచేస్తాయి.
థైరాయిడ్ ఉన్న వాళ్లు ధనియాలను ఎక్కువగా తీసుకోవాలి. జీర్ణక్రియలకు తోడ్పడే ఎంజైమ్స్ ఉత్పత్తిలో ధనియాలు ఉపయోగపడతాయి.
జీలకర్ర: జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ అధికంగా ఉంటాయి. జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గుండెలో మంట, మలబద్ధకం, అజీర్తి తగ్గుతాయి.
జీలకర్రలో తల్లిపాల ఉత్పత్తిని పెంచే ఔషధ గుణాలుంటాయి.