Site icon Prime9

Hyperactive kids: పండ్లు, కూరగాయలతో హైపర్ యాక్టివ్ పిల్లలకు ఎంతో మేలు

Hyperactive kids

Hyperactive kids

Hyperactive kids: ఏ తల్లిదండ్రలైనా పిల్లలు చురుగ్గా, హుషారుగా ఉండాలనుకుంటారు. అయితే అదే హుషారు, చురుకుతనం ఎక్కువగా ఉంటే మాత్రం చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇదే హైపర్ యాక్టివ్ నెస్ గా మారి పెరేంట్స్ కు మానసిక వ్యథను మిగిలిస్తుంది. కానీ హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లల కోసం కూడా కొన్ని విరుగుడులు ఉన్నాయి.

కొన్ని చిట్కాలు పాటిస్తే వారిలోని అతి చురుకుతనాన్ని కళ్లెం వేయచ్చనని మానసిక నిపుణులు చెబుతున్నారు. హైపర్ యాక్టివ్ తో పెద్దగా నష్టం ఏం జరగపోయినా.. ఆ పిల్లలు మాత్రం తమ ఎనర్జీ లెవెల్స్ ను ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అదే సమయంలో అందరికీ చుక్కలు చూపిస్తారు. అందుకే హైపర్ యాక్టివ్ ఉన్నపిల్లలను చూసుకోవటం అంటే పెద్ద చాలెంజ్ తో కూడిన పని.

 

ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధన(Hyperactive kids)

వాళ్లు కుదురుగా ఒకచోట ఉండలేరు. దేని మీదా ఎక్కువ సేపు ధ్యాస పెట్టలేరు. విషయాలను గుర్తుంచుకునే శక్తి కూడా ఈ పిల్లల్లో తక్కువే. కోపం లాంటి భావోద్వేగాలనూ నియంత్రించుకోలేరు.

ఇలాంటి వారికి పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తున్నట్టు అమెరికాలోని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

వీటితో హైపర్ యాక్టివ్ నెస్ (ఏడీహెచ్‌డీ) లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు కనుగొన్నారు.

మెదడులో కొన్ని నాడీ సమాచార వాహకాల మోతాదులు తగ్గటానికీ అతి చురకుతనానికి(hyperactive kids) సంబంధం ఉంటున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ నాడీ సమాచార వాహకాల తయారీలో, మొత్తంగా మెదడు పనితీరులో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి.

 

Four Top Foods That Help ADHD Symptoms - Indian Crest Pediatrics

ఎంత మంచి ఆహారం తింటున్నారు?

ఆకలితో ఉన్నప్పుడు ఎవరికైనా చిరాకు కలుగుతుంది. ఏడీహెచ్‌డీ పిల్లలూ దీనికి మినహాయింపు కాదు.

తగినంత ఆహారం తినకపోతే లక్షణాలు మరింత తీవ్రం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలకు తగినంత తిండి ఇవ్వలేని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో ఒత్తిడి తలెత్తుంది.

అది కుటుంబంలో గొడవలకు దారి తీస్తోందని, ఇదీ పిల్లల్లో ఏకాగ్రత లోపించటం లాంటి లక్షణాలు తీవ్రమయ్యేలా చేస్తోందని వివరిస్తున్నారు.

సాధారణంగా ఏడీహెచ్‌డీ లక్షణాలు ఎక్కువైనప్పుడు డాక్టర్లు మందుల మోతాదు పెంచుతుంటారు.

మందులు వేసుకోని వారికైతే చికిత్స ఆరంభిస్తారు. దీనికన్నా ముందు పిల్లలకు తగినంత ఆహారం అందుబాటులో ఉంటోందా?

ఎంత మంచి ఆహారం తింటున్నారు?  అనేవి చూసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar