HIV: చికిత్సే కాని నివారణ లేని వ్యాధి ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మందిని బాధిస్తోంది. వ్యాధి చికిత్సకు మెరుగైన ఔషధాలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయి నివారణ అనేది మాత్రం లేదు. కొన్ని తెలిసి తెలియని పరిస్థితుల కారణంగా కొందరు ఈ మహమ్మారి బారిన పడుతుంటారు. కాగా మీకు సాధారణమైన జీవనం సాగించాలని ఉండి మీ భాగస్వామి ద్వారా సంతతి కలగాలని ఆశ ఉందా అయితే మీకు ఐవిఎఫ్( ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పెద్దతి ఓ మంచి వరం అని వైద్యులు వెల్లడిస్తున్నారు. కానీ ఈ పద్ధతిపై అనేక అనుమానాలు ఉన్నాయి మరి వాటికి సంబంధించి వివరణలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
HIV రోగులకు వరం
మీరు హెచ్ఐవి ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందిన సాంకేతిక చికిత్సలతో మీ సొంత స్పెర్మ్‌ను ఉపయోగించడం ద్వారా కూడా తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంది.
ఐవిఎఫ్ చికిత్స అనేది హెచ్ఐవి ఉన్న రోగులకు ఖచ్చితంగా ఒక మంచి ప్రయోజనమని డాక్టర్ రమ్య తెలిపారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది పురుషుల స్పెర్మ్, స్త్రీ అండాన్ని శరీరం వెలుపల ఫలదీకరణం చేసే చికిత్సా పద్ధతి అని దీని ద్వారా హెచ్ఐవీ లేని స్త్రీ గర్భవతి కావచ్చని కామినేని ఆసుపత్రి సీనియర్ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ శ్రీ రమ్య కంటిపూడి వెల్లడిస్తున్నారు.
HIV సంక్రమణను తగ్గించవచ్చు
ఒక మగ భాగస్వామికి హెచ్ఐవీ ఉండి, స్త్రీకి హెచ్ఐవీ లేని సందర్భంలో ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఒకరి ద్వారా మరొకరికి హెచ్ఐవీ సంక్రమించే ప్రమాదాలను తగ్గించడానికి స్పెర్మ్ వాషింగ్ అని పిలువబడే సాంకేతికతను ఉపయోగించవచ్చని కామినేని వైద్యులు తెలిపారు. స్పెర్మ్ వాషింగ్, ఐసీఎస్ఐ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలతో కలిపి, హెచ్ఐవి తల్లి లేదా బిడ్డకు సంక్రమించే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. హెచ్ఐవి -పాజిటివ్ జంటలు, వ్యక్తులు స్పెర్మ్ వాషింగ్ ద్వారా సురక్షితంగా గర్భం దాల్చడానికి అనుమతించే సహాయక పునరుత్పత్తి సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే ఐవిఎఫ్ చికిత్సతో శిశువుకు హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
ఐవీఎఫ్ పద్ధతి సేఫ్
తల్లులు కావాలనుకునే మహిళా హెచ్ఐవి రోగులు ఐవిఎఫ్ తర్వాత యాంటీరెట్రోవైరల్ థెరపీని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యకరమైన భావనలను కలిగి ఉంటారు.
వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ద్వారా గర్భం ధరించి ఉన్న కాలమంతా జాగ్రత్తగా పర్యవేక్షించడంతో సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కామినేని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులకు చక్కటి చిట్కాలు