Site icon Prime9

Health News : ఆ రకంగా శృంగారం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసా..?

health news about dangerous types of romance

health news about dangerous types of romance

Health News : మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలకమైన అంశం. శృంగారం అనేది ఒక శారీరక సంతృప్తిని మాత్రమే కాక మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే సాధారణంగా శృంగారం పై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. అంతే కాకుండా శృంగారం చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దరిచేరవు.  శృంగారం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా తరచూ శృంగారం చేయడం వల్ల గుండె జబ్బులు దూరం అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు అధికారికంగా నిరూపించారు. కానీ శృంగారాన్ని శృతిమించి చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ఎటువంటి సందర్భాలలో శృంగారం ప్రమాదమో మీకోసం ప్రత్యేకంగా..

వయస్సు..

వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదమని అంటున్నారు. ఉదాహణకు 24 సంవత్సరాల యువకుడు 52 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే 25 సంవత్సరాల యువకుడు వయసు రీత్యా బలంగా, శక్తివంతంగా ఉంటారు. కావున ఆ స్పీడ్‌ను 52 సంవత్సరాల మహిళ తట్టుకోలేదని అభిప్రాయపడుతున్నారు. దాంతో కొన్నిసార్లు ఆమె ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.

మద్యం..

అలాగే మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం అన్నది చాలా ప్రమాదం. మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనే చాలా మందికి తెలీదు. ఆ మత్తులో శృంగారం కూడా చాలా ప్రమాదకరం. మద్యం సేవించిన తర్వాత దాదాపు చాలా మంది కోరికలు ఎక్కువగా కలుగుతాయి. అయితే ఆ సమయంలో మన మెదడు చెప్పేమాట వినే పరిస్థితిలో శరీరం ఉండదు. పురుషాంగానికి తీవ్రంగా గాయం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

ఎక్కువ సార్లు.. 

రోజులో ఎక్కువ సార్లు సెక్స్‌ చేయడం కూడా ప్రాణాలకు ప్రమాదం. కొందరికి ఎక్కువ సార్లు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ అది ఏమంత ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

వేగం.. 

మితిమీరిన వేగంతో శృంగారం చేయడం వల్ల హృదయ స్పందన ఎక్కువ అయ్యి, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

డ్రగ్స్‌..

డ్రగ్స్‌ తీసుకుని శృంగారంలో పాల్గొనడం కూడా ప్రమాదం. అలా చేయడం వల్ల కూడా అదుపు తప్పి శృంగారం చేయడం, దాంతో హార్ట్‌ ఎటాక్‌ రావడం జరుగుతుంది.

కిస్.. 

కొందరు తమ పార్ట్ నర్ ని ముద్దులతో ఊపిరాడకుండా చేస్తారు. ఎక్కువసేపు అలా చేయడం వల్ల ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంటుంది.

ఇలా పలు రకాల కారణాలు సదరు వ్యక్తి ప్రాణాలకు ప్రమాదంగా మరతయాని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version