Site icon Prime9

Dry Amla: వీటిని రోజూ భోజనానికి ముందు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనం మీ సొంతం

Dry Amla

Dry Amla

Dry Amla: అందంగా కనిపించడానికి యువత చేసే పనులు అన్నీ ఇన్నీ కావనుకోండి. రాయని క్రీము ఉండదు వాడని సబ్బులు ఉండవు. వెయ్యని ఫేస్ ప్యాక్స్ ఉండవు. అయినా కానీ ఏవో ఒక ఎఫెక్ట్స్ వల్ల ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే ముఖంపై ముడుతలు వస్తున్నాయా.. అయితే దానికి చక్కటి వంటింటి చిట్కా మీకోసమే. ఎంటువంటి క్రీములు వాడకుండా చక్కగా రోజూ అన్నం తినడానికి ముందు ఇది తింటే చాలు నిత్య యవ్వనం మీ సొంతం. మరి అదేంటి ఎంత ఖర్చులో లభిస్తుంది దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయతో యవ్వనం(Dry Amla)

ఉసిరికాయ అందరికీ తెలిసిందే. ఇది ఔషధగని ఇదివరకుఉసిరికాయల మనం చెప్పుకున్నాం. వీటిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉండడంతో పాటు రుచికి రుచి కూడా ఉంటాయి కాబట్టి చిన్న నుంచి పెద్దవారి వరకూ అందరూ వీటిని తినడానికి ఆసక్తి కనపరుస్తారు. అయితే పచ్చి ఉసిరికాయలతో పాటు ఎండిన ఉసిరికాయల్లో కూడా ఈ పోషకాలు ఉంటాయండోయ్.. ఆయుర్వేదంలో విరివిగా పచ్చి, ఎండు ఉసిరి ఉపయోగిస్తారు.. ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా జామ్ తయారు చేసుకుని తిన్నా కూడా మంచిదే.. జ్ఞాపక శక్తి మెరుగుపతుంది.. రక్తాన్ని పెంచుతుంది.

ఎండిన ఉసిరికాయలను రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల చర్మంపై ముడుతలు, చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా నిత్య యవ్వనంగానూ ఉండవచ్చు.

Exit mobile version