Site icon Prime9

Beauty Tips: ముఖంపై మొటిమలు, మచ్చాలా.. అయితే పటికను ట్రై చెయ్యండి

beauty tips

beauty tips

Beauty Tips: ముఖంలో ఉన్న ముడతలు మొటిమల మచ్చలు ఎంతో చిరాకును కలిగిస్తుంటాయి. నుదుటిపై ఉన్న మడుతలు మరియు మొటిమ మచ్చలను తొలగించడానికి యువత నానా ప్రయత్నాలు చేస్తుంటారు. పటికను ముఖంపై అప్లై చేసినట్లైయితే అవి తొలగిపోతాయి. పటికలో ముఖ్యంగా యాంటీ బాక్టీరియల్ మరియు బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖంపై మచ్చలను తొలగించడంలోనూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మం జారిపోయినట్లు ఉండకుండ చర్మాన్ని బిగుతుగా నిగారింపుతో మెరిసేలా ఉంచుతుంది. వేసవిలో వడదెబ్బ సమస్య ఉన్నా కూడా పటికతో తొలగించవచ్చు. మొటిమలు, ముడతలు, దురద, తామర మొదలైన వాటిని తొలగించడంలో పటిక ఎలా సహాయపడుతుందో మనం తెలుసుకుందాం.

పటికతో ప్రయోజనాలు(Beauty Tips)

పసుపుగా ఉన్న దంతాలపై పటికను అప్లై చేస్తే.. మీ దంతాలు తెల్లగా మిలమిలా మెరిసేలా చేస్తుంది. ఇలా వారానికి 3 రోజులు వాడితే ముత్యాల్లాంటి పళ్లు మీ సొంతం అవుతాయి. అంతేకాకుండా కొబ్బరినూనెలో పటికను మిక్స్ చేసి మెడ, చంకల్లో నల్లగా ఉన్న చోట రాస్తే ఒక్కసారిగా ఆ డార్క్ మచ్చలు పోతాయి. అంతేకాకుండా భుజం మరియు నడుము కొవ్వును తగ్గిస్తుంది.

వేసవిలో వడదెబ్బ నివారణకు పటిక చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకోసం అరకప్పు నీటిలో 2 చెంచాల పటిక పొడిని కలపాలి. ఆ తర్వాత వడదెబ్బ తగిలిన ప్రదేశంలో రాయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. 15 రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్ నివారణకు 1 టీస్పూన్ పటిక పొడిని 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. ఈ రెమెడీని 15 రోజులు పాటు పాటించండి. అంతేకాకుండా పటికను నీటిలో ముంచి, తేలికగా చేతులతో ముఖం మీద రుద్దండి. ఆ తర్వాత కొంత సమయం ఆరనివ్వండి. తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీ మీ ముఖంపై ఫైన్ లైన్స్ మరియు ముడతలు రాకుండా చాలా బాగా సహాయపడుతుంది.

Exit mobile version