Site icon Prime9

Hair Loss: ఈ లక్షణాలు వల్లే జుట్టు రాలిపోతుంది!

hair 2 prime9news

hair 2 prime9news

Hair Loss: ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలిపోవడంతో బాధ పడుతుంటారు. ఎక్కువ ఆలోచించడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు ఎక్కువ మోతాదులో ఊడిపోతే డాక్టర్ సలహాలను తీసుకోండి. ఇలా బాధ పాడుతూ మానసికంగా కూడా కుంగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఐతే జుట్టు రాలిపోకుండా ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు.

ఒత్తిడి..
ఒత్తిడి గురించి మనం కొత్తగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆఫీసు పనులు ఐపోయిన తరువాత ఇంటి పనులు ఇలా రోజంతా ఇలానే గడిచిపోతుంది. ఒత్తిడి కారణంగా పోషక పదార్థాలు బ్యాలెన్స్డ్‌గా ఉండకపోవడం వల్ల ఈ ముఖ్య కారణం వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఒత్తిడికి వీలైనంత వరకు దూరంగా ఉంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.

ఒత్తిడిని అధిగమించడానికి తగినవి పాటించాలిసిందే
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి మనకి బాగా సహాయపడతాయి.
అలాగే పాటలు వినడం వల్ల కూడా ఒత్తిడి దూరం అవుతుంది.
నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనలు మైండ్లో ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ఇలా మీ జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఒత్తిడిని దూరంగా చేయవచ్చు. అలాగే అందమైన కురులను కూడా పొందొచ్చు.

బరువు తగ్గడం..
బరువు తగ్గితే జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే కొన్ని ముఖ్యమైన పోషక పదార్థాలు మన శరీరంలో తగ్గిపోయి కొన్ని పోషక పదార్థాల లోపం కలగడం వల్ల  జుట్టు ఎక్కువుగా రాలిపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గి ఉంటే మీ జుట్టును కాపాడుకోండి.

Exit mobile version