Dry Fruits: కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ ఏ రోగం వస్తుందో ? కూడా తెలీడం లేదు. బయట పతిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం మన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నుంచి 5 డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాము. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే అటు ఇటు తిరుగుతా ఐనా నోటిలో వేసుకొని తినేయండి.
డ్రై ఫ్రూట్స్ తిన్న వారు రోజంతా ఉల్లాసంగా,యాక్టివ్, శక్తి వంతంగా ఉంటారు. వీటి గురించి మీకు తెలిస్తే వీటిని తినకుండా ఉండలేరు.డ్రై ఫ్రూట్స్ లో ఉండే ప్రొటీన్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ మనకు అధిక మొత్తంలో దొరుకుతాయి.డ్రై ఫ్రూట్స్ కొంత మంది నాన పెట్టుకొని తింటారు..మరి కొంత మంది డ్రై ఫ్రూట్స్ నాన పెట్టకుండానే తినేస్తుంటారు.డాక్టర్స్ ఏమి చెప్తున్నారంటే డ్రై ఫ్రూట్స్ నానెబట్టి తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని వెల్లడించారు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల లాభాలను తెలుసుకుందాం.
1.వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి.
2.మీ ఇంట్లో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
3.ఫైల్స్ సమస్యలు వీటిని రోజు తీసుకోవాలిసిందే.
4.హై బీపీ ఉన్నవారికీ బీపీ కంట్రోల్ అవుతుంది.
5.రక్త హీనత సమస్య కూడా తొందరగా తగ్గుముఖం పడుతుంది.
6.జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.