Cumin seeds: ప్రతి ఇంటి వంటింట్లో ఉండే పోపుల పెట్టెలో కావాల్సినన్ని పోషకాలు ఉన్నాయనేది నిపుణుల మాట. పోపుల పెట్టెలో ఉండే పదార్థాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టచ్చని సూచిస్తున్నారు. కరోనా కాలంలో ఎన్నో వేరియంట్లు, మ్యూటేషన్లు అటాక్ అవ్వడానికి ప్రధాన కారణమం ‘ఇమ్యూనిటీ’ లెవల్స్ తగ్గడం.
అయితే వివిధ రకాల మందులు , ఇంజక్షన్లు, వ్యాక్సిన్స్ తో రోగనిరోధక శక్తి పెంచుకునే వీలు ఉంది. కానీ, వంటింట్లో ఉండే పోపులపెట్టె వైద్యమే చాలా వరకు ఉపయోగపడింది. ఎన్నో మందులతో ఇమ్యూనిటీ పెంచుకున్నా.. మంచి ఆహారంతో వచ్చే రోగనిరోధక శక్తితో సమానం కాదు కదా.
పోపులపెట్టెలో ఖచ్చితంగా ఉండే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకు మన పెద్దలు తాలింపులో జీలకర్ర వేయడం అలవాటు అయింది. అయితే, జీలకర్రను తాలింపు వరకే పరిమితం చేయడం వల్ల కొంత ప్రయోజనాలే దక్కుతాయి. జీలకర్రను సరైన పద్దతిలో వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్రతో కలిగే ప్రయెజనాలెన్నో..(Cumin seeds)
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ అధికంగా ఉంటాయి. జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గుండెలో మంట, మలబద్ధకం, అజీర్తి తగ్గుతాయి. జీలకర్రలో తల్లిపాల ఉత్పత్తిని పెంచే ఔషధ గుణాలుంటాయి.
ప్రతిరోజూ పొద్దన్నే జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. జీలకర్ర క్రమ తప్పకుండా ఉపయోగించడం వల్ల రక్తహీనత కూడా దరిచేరదు. రక్తంలో హెమోగ్లోబిన్ తయారవటానికి కావాల్సిన ఐరన్.. జీలకర్రలో పుష్కలంగా ఉంటుంది.
ఎక్కువగా పిల్లలలో, ఆడ వాళ్ళలో, యువత లో ఎక్కువగా అనీమియా వస్తుంది. దానికి శరీరంలో ఐరన్ తగ్గటమే కారణమవుతుంది. అయితే, ఆహారంలో జీలకర్రని చేర్చుకోవడం వల్ల ఐరన్ ని పొందొచ్చు.
జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. కడుపులో నులి పురుగుల లాంటి సమస్య పరిష్కారమవుతుంది. కిడ్నీ రాళ్లుతో బాధపడే వారికి జీలకర్ర మంచి మందుగా పనిచేస్తుంది. జీలకర్రకు కిడ్నీ రాళ్లను కరిగించే శక్తి ఉంది.
జీలకర్రలో విటమిన్ ‘ఈ’ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది. మొటిమలు, గజ్జి, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు జీలకర్ర రసం బాగా ఉపయోగపడుతుంది.
ఆలివ్ ఆయిల్, జీలకర్ర నూనె, ఆలివ్ ఆయిల్ ను సమానంగా తీసుకుని బాగా కలిపి జుట్టుకి రాయడం వల్ల వెంట్రుకల పెరుగుదల ఉంటుంది. జట్టు రాలడం నియంత్రణలో ఉంటుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల నెలసరిలో వచ్చే ఇబ్బందులు తక్కుతాయి. క్రమ తప్పకుండా నెలసరి వచ్చేలా జీలకర్ర ఉపయోగపడుతుంది.
మానసికంగా కలిగే ఒత్తిడిని జీలకర్ర దూరం చేస్తుంది. హాయిగా నిద్ర పోవడానికి జీలకర్ర నీటిని తాగడం మంచిది. జీలకర్ర నీరు తాగేవాళ్లకి బీపీ అదుపు లో ఉంటుంది. బీపీ అదుపులో ఉండటం వల్ల రక్త సరఫరా మెరుగు పడటమే గాక రక్తనాళాల్లోని అడ్డంకులు తొలుగుతాయి. తద్వారా గుండె సమస్యలు రావు.