Site icon Prime9

Cucumber Benefits: బరువు తగ్గించేందుకు కీరా

cucumber

cucumber

Cucumber Benefits: ఎన్నో పోషకాలు నిండి ఉంటుంది కీర దోసకాయ. దీని వల్ల మన శరీరంలోని చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అందుకే ఎండాకాలంలో అందరూ దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. అసలు కీరా వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

వేగంగా బరువు తగ్గేందుకు(Cucumber Benefits)

నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా దోస కూడా ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందొచ్చు. దీంతో శరీరానికి చలువ కూడా చేస్తుంది.

కీరాను రోజూ సలాడ్స్‌లో భాగం చేసుకోవడం లేదంటే కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగులో ముంచుకుని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

రోజుకు రెండు కీరాలు తినడం ద్వారా బరువు వేగంగా తగ్గవచ్చు. కీరాలోని ఖనిజ లవణాలతో చర్మం నునుపుగా మారి, బిగుతుగా తయారవుతుంది.

చర్మానికి న్యాచురల్ మెరుపు అందుతుంది. వయసు పైబడే లక్షణాలతో పోరాడుతుంది కీరా. వెంట్రుకలు రాలడం తగ్గడంతో పాటు, జుట్టు మెరుపు కూడా కీరా తినడం వల్ల వస్తుంది.

చర్మ సౌందర్యానికి

బీపీ ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్లు కీరాను తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

కీరా దోసకాయను రోజూ తినడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. అలాగే కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించడంలో కీరా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. లాంటి సమస్యలతో బాధపడుతున్న వాల్లు చల్లటి కీరా ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.

చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్.. వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.

కాబట్టి చర్మానికి సంబంధించిన రకరకాల బ్యూటీ ట్రీట్‌మెంట్లలో కీరాను ఉపయోగిస్తారు.

కీరాలో ఉండే సిలికా వల్ల జుట్టు, గోళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇది చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ వచ్చే అవకాశాలను కీరా చాలా వరకు తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

 

శరీర ఉష్ణోగ్రత అదుపులో

కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అందుకే జ్వరంతో బాధపడుతున్న వారికి దీన్ని ఎక్కువగా ఇస్తుంటారు.

ఎండాకాలంలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. దీంతో శరీరం శక్తిని కోల్పోతుంది.

కాబట్టి కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరా దోస బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సి లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరా బాగా ఉపయోగపడుతుంది.

ఇది దంతాల ఆరోగ్యానికి కూడా అత్యవసరం.

కొలెస్ట్రాల్ లేని ఈ కీరా దోసను తినడం వల్ల గుండె జబ్బులు కూడా దూరమవుతాయి. కీరాలో ఎక్కువగా ఉండే ‘కె’ విటమిన్ వల్ల మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో క్యాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి.

ఈ రోజుల్లో ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. దీనివల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దోసకాయలో ఉండే ‘బి’ విటమిన్ అడ్రినల్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తుంది.

తద్వారా ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుతుంది.

 

Exit mobile version