Site icon Prime9

Covid 19 infection: కొవిడ్ తర్వాత గుండెపోటులపై కేంద్రం పరిశోధనలు

Covid-19 infection

Covid-19 infection

Covid-19 infection: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య మత్రి మన్ సుఖ్ మాండవీయ కరోనా వైరస్ పై కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 214 రకాల కొవిడ్ వేరియంట్లు గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఈ వేరియంట్లపై కొవిడ్ వ్యాక్సిన్లు ధీటుగా పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం BF7 ఉప రకమైన XBB 1.16 వేరియంట్ వ్యాప్తిలో ఉందని తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. పరిస్థితులను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

గుండెపోటులపై రీసెర్చ్(Covid 19 infection)

అదే విధంగా మన్ సుఖ్ మాండవీయ మరికొన్ని ఆసక్తి కర విషయాలను కూడా తెలిపారు. దేశంలో భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ‘కొవిన్’నుంచి వచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అయితే, కొవిడ్ తర్వాత గుండె సంబంధిత కేసులు ఎక్కువ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని.. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ICMR) వారి పరిశోధన ప్రారంభించిందని వెల్లడించారు. ఈ విషయంపై 3, 4 నెలల క్రితమే పరిశోధన మొదలైందన్నారు. రెండుమూడు నెలల్లో వాటి ఫలితాలు వస్తాయని తెలిపారు. కోవిడ్ కు, గుండెపోటుకు మధ్య ఉన్న సంబంధాన్ని కొనుగొనేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు దేశంలో కొత్త వేరియంట్‌ గుర్తించిన వెంటనే వాటిని ల్యాబ్‌లో ఐసోలేట్‌ చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. అనంతరం వాటిపై వ్యాక్సిన్ల పనితీరు ఎలా ఉందో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు మన దేశంలో వ్యాప్తిలో ఉన్న అన్ని వేరియంట్లను వ్యాక్సిన్లు సమర్థమంతంగా ఎదుర్కొంటున్నట్టు పరిశోధనలో తేలిందన్నారు.

 

Exit mobile version