Site icon Prime9

Consuming water: ఈ పదార్ధాలు తిన్న తర్వాత అసలు నీరు తాగకండి

Consuming water

Consuming water

Consuming water: భోజనం చేయడానికి ముందు, తినేటప్పుడు.. భోజనం చేసిన తర్వాత మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే తినే ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దానికి కారణం. మంచినీళ్లు తాగడం వల్ల ఆహారం త్వరగాపేగుల్లోకి చేరుకుంటుంది. అయితే అలా జరగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా కొన్ని రకాల ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దాం..

 

అజీర్తి సమస్య(Consuming water)

చాలా మంది అరటి పండు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగుతుంటారు. కానీ అలా చేయొద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి నీళ్లు అసలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుందని హెచ్చరిస్తున్నారు. అరటి పండు తిన్న పావు గంట తర్వాతే నీళ్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

పుచ్చకాయ తిన్న తర్వాత మంచినీళ్లు తాగితే కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది. శరీరం ఆహారాన్ని శోషించుకోవడాన్ని, జీర్ణం కావడాన్ని నీరు నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా కడుపులో ఆమ్లస్థాయిలు పెరిగిపోతాయి.

వేరు శెనగలు తిన్న తర్వాత కూడా మంచినీళ్లు తాగక పోవడమే మంచిది. వేరు శనగల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వుపేరుకుపోతుంది. దాని వల్ల దగ్గు, గొంతు మంట దారి తీస్తుంది.

What To Eat and Drink After Food Poisoning - GoodRx

 

పీహెచ్ స్థాయిల్లో మార్పులు

నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వాటిని తిన్నాక.. నీటిని తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

గోరు వెచ్చని పాలు తాగిన తర్వాత మంచినీళ్లు తాగితే కడుపు నొప్పి వస్తుంది లేదా పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. పాలు తాగాక నీరు తాగడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. పాలు తాగిన తర్వాత పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. కానీ నీటిని తాగడం వల్ల ఆమ్లాలు పలుచన అవుతాయి. దీంతో శరీరం మరింతగా ఆమ్లాలు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది అసమతుల్యతకు దారి తీస్తుంది.

Exit mobile version
Skip to toolbar