Site icon Prime9

Children Health: వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు అవసరం

Children Health

Children Health

Children Health: ఎండాకాలం వస్తే.. ఇంట్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో సెలవులు కారణంగా పిల్లలు మండుటెండలో ఎక్కువగా తిరుగుతుంటారు. కానీ సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేసే వాళ్లకి.. ఈ ఎండలే ప్రమాదకరంగా మారతాయని తెలియకపోవచ్చు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అవి మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చర్మ సమస్యలకు కూడా దారి తీస్తాయి.

గాలిలో వెలువడే కాలుష్య కారకాలు, సూర్యుడి నుండి వచ్చే కఠినమైన యూవీ కిరణాలు, వేడి వల్ల వచ్చే చెమట లాంటివి పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఈ వేసవిలో మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఏడాది పొడవునా ఫ్లూ తో బాధపడుతుంటారు. అది వేసవిలో మరీ ఎక్కువ. కాబట్టి చిన్నపిల్లలకు వేసవిలో ఎండ తగలకుండా చూసుకోవాలి. సాయంత్రం లేదా పొద్దున వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా వేసవిలో వారికి సరైన పోషకాహారం అందించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

చర్మ సమస్యలకు రాకుండా

వేసవిలో దోమల బెడద ఎక్కువ. దోమలే కాకుండా, పిల్లలు కీటకాల కాటుకు కూడా గురవుతారు. కాటు గురైన ప్రాంతంలో దురద, వాపుకు కారణమవుతుంది. డాక్టర్ సూచించిన విధంగా పిల్లలకు ప్రత్యేక దోమల నుంచి రక్షణ కల్పించాలి.

 

కలుషిత ఆహారం తినడం లేదా కలుషితమైన పానీయాలు తాగడం వల్ల అనేక రకాల జీర్ణకోశ సమస్యలు వస్తాయి. కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అదే చిన్న పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. నాసిరకం, శుభ్రత లేని కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల హానికరమైన వైరస్‌లు, ఇతర టాక్సిన్స్ కారణంగా పిల్లలలో ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. శీతల పానీయాలు, జంక్‌ ఫుడ్‌ పిల్లలు తినకుండా చూసుకోవాలి.

 

డీహైడ్రేట్ కాకుండా..

పిల్లలు ఆరుబయట ఆడుకుంటూ నీళ్లు తాగడం మరిచిపోతుంటారు. వేసవిలో నీళ్లు తగనంతగా తాగకపోతే.. త్వరగా డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి ఎండాకాలంలో పిల్లలకు కనీసం రోజుకు 7, 8 గ్లాసుల నీరు తాగేలా చేయండి.

అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు తినిపించడం, పండ్ల రసాలు ఇవ్వడం రీహైడ్రేషన్ డ్రింక్స్ అందించడం కూడా మంచిది. డీప్‌ ఫ్రీజర్‌లో చల్లబరిచిన నీళ్లు కాకుండా, ఫ్రిజ్‌లో డోర్‌లో ఉంచిన నీళ్లు తాగించడం మేలు.

వేడి , తేమతో కూడిన వాతావరణం చెమటకు దారితీస్తుంది. ఫలితంగా ఎగ్జిమా, దురద లాంటి అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. అదనంగా, చర్మంపై చెమటలు మరియు చర్మం యొక్క దురద కూడా సంభవించవచ్చు. కాబట్టి పిల్లలకు చెమట ఎక్కువగా పట్టినప్పుడు శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించండి.

 

 

Exit mobile version