Site icon Prime9

Butter Milk Benefits: మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా..

Butter Milk Benefits

Butter Milk Benefits

Butter Milk Benefits: బయట ఎండలు దంచి కొడుతున్నాయి. పని మీద బయటకు వెళ్లాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో దాహం ఓ పట్టాన తీరదు. ఆ దాహార్తిని తీర్చడానికి చల్ల చల్లగా నీళ్లు, పండ్ల రసాలు, రకరకాల డ్రింక్స్ తాగుతుంటాయి. అయితే వాటన్నింటికంటే ఎండాకాలం దాహం తీర్చడంతో పాటు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంలో మజ్జిక కీలక పాత్ర పోషిస్తుంది.

ఎండ వేడికి చల్లని మజ్జిగ తాగితే మంచి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అదే విధంగా మజ్జిగతో చర్మాన్ని, వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

 

బ్లడ్ సర్క్యూలేషన్ కోసం(Butter Milk Benefits)

వేసవిలో శరీరం డీ హైడ్రేషన్ కు గురి అవుతుంది. మజ్జిగ తాగడం వల్ల దాని బారి నుంచి బయటపడవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆకలిని పెరిగేందుకు మజ్జిక ఉపయోగపడుతుంది.

శరీరంలో కాల్షియం స్థాయిలు మజ్జిగ వల్ల పెరుగుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, అసిడిటీ తగ్గిస్తుంది. ఎండకు వెళ్లి ఇంటి వచ్చిన వెంటనే.. చల్లటి మజ్జికలో ఒక నిమ్మ కాయని పిండుకుని తాగితే.. వడదెబ్బ తగలకుండా ఉంటారు.

దంతాలు, ఎముకలు ధృడంగా ఉండటానికి పల్చని మజ్జిక చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. వీటితో పాటుగా బ్లడ్ సర్క్యూలేట్ కూడా మెరుగుపడుతుంది. అలాగే అజీర్ది సమస్యలు కూడా దరిచేరవు. ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్ లాంటి సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు.

 

ట్యాన్ ను తొలగించడంలో..

మజ్జిగ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఖాళీ కడుపుతో మజ్జిగ తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే ఫైల్స్ దూరం అవుతాయి.

వేసవి ట్యాన్ ను కూడా మజ్జిగ తొలగిస్తుంది. చిటికెడు పసుపు, చందనం పొడిలో సరిపడా మజ్జిగ వేసి ఆ మిశ్రమంతో ముఖాన్ని మృదువుగా మర్దనా చేసి.. తర్వాత మంచినీళ్లతో కడిగితే చర్మం ప్రెష్ గా మారుతుంది.

అదే విధంగా బొబ్బాయి లేదా టామాటా గుజ్జుకు కొంచెం మజ్జిగ కలిపి ముఖానికి రాసుకుని.. కొంచెం సేపు తర్వాత కడిగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొన్ని గిరిజన ప్రాంతాల్లో మజ్జిగతో తలస్నానం చేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. కార్పోహేడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు మజ్జిగ లో ఉన్నాయి. మజ్జిగ చుండ్రు, పొడివారే తత్వాల్ని దూరం చేస్తుంది.

ఎండవల్ల ఏర్పడిన మచ్చలు దూరమై ముఖం లో గ్లో పెరుగుతుంది. మజ్జిగలో ఉండే క్లీనింగ్ ఎంజైమ్స్ చర్మాన్ని క్లెన్సింగ్ చేసి మురికిని పోగొడతాయి.

 

Exit mobile version