Beetroot Facts: మనకు తక్షణమే శక్తిని.. ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బీట్ రూట్ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్ రూట్ ను తినడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపించరు.
కానీ, ఈ దుంపజాతిలో చెప్పలేనన్ని పోషకాలు నిండి ఉన్నాయి. బీట్ రూట్ లోని ఆరోగ్య ప్రయోజనాలు తెలియక, చాలామంది ఈ దుంపను తినడానికి ఇష్టపడరు. బీట్రూట్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
శరీరానికి శక్తినిచ్చే అనేక రకాల దుంపజాతి ఆహార పదార్థాలు శరీరానికి శక్తిని ఇస్తాయి. కానీ అన్నింటి కన్నా బీట్‌రూట్‌ది మాత్రం ప్రత్యేక స్థానమే అని చెప్పుకోవచ్చు.
కలర్ ఫుల్ గా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ లాంటివి ఆరోగ్యానికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి.
ఈ రెండూ శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతాయని అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది బీట్రూట్ను మాత్రం పక్కనపెట్టేస్తారు.
బీట్రూట్ను డైరెక్ట్ గా తినొచ్చు.. జ్యూస్ చేసుకుని తాగొచ్చు, కూరగానూ చేసుకోవచ్చు.
షుగర్ తో ఇబ్బందిపడే వాళ్లు బీట్రూట్ను తీసుకుంటే కాలేయ సంబంధింత సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.
బీట్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం బీట్ రూట్ ఎదో ఒక రూపంలో అయినా తీసుకుంటారు.
అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం తదితర వ్యాధులన్నీ జీవనశైలి మార్పుల వల్లే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వ్యాధులను నిరోధించాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
రోజూ తీసుకునే ఆహారంలో బీట్రూట్ లాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్ట్‌లు సలహా ఇస్తున్నారు.
బీట్రూట్ను పచ్చిగా తినడం లేదా ఉడికించి అయినా.. జ్యూస్ చేసుకుని తాగుతూ ఉండాలంటున్నారు.
బీట్రూట్ లో ఉండే ఇందులో ఉండే నైట్రేట్లు, నైట్రిక్ ఆక్సైడ్.. అధిక రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఇవి రక్త సరఫరాలో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. అవయవాలన్నింటికీ ఆక్సిజన్ సరిగ్గా అందించడంలో తోడ్పడతాయి.
రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉండాలి. జ్యూస్ తాగలేని వారు ఒక బీట్రూట్ ముక్కను రోజూ తింటూ ఉండాలి
బీట్రూట్లో నైట్రేట్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరం కాల్షియంను ఉపయోగించుకోవడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ సమకూరి రక్తహీనత లేకుండా చేస్తుంది.
శరీరంలో హిమోగ్లోబిన్, రక్తం శాతం పెరుగుతాయి. అలాగే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా లభిస్తుంది.
బీట్రూట్లో ఉండే శక్తిమంతమైన లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది.
బీట్రూట్లో విరివిగా లభించే కెరోటినైట్స్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.
బీట్రూట్కు ఎరుపు రంగును కలిగించే బీటా సయానిన్కు పెద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది.
సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలను తట్టుకుంటుంది. బీట్రూట్లో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది.
పెద్దపేగులో ఉండే బ్లాకేజీలను తొలగించడానికి బీట్రూట్లో ఉండే ఫైబర్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బి విటమిన్స్ శరీరాన్ని మరింత చురుగ్గా ఉంచుతాయి.
బీట్రూట్లో మరో ప్రయోజనం కూడా ఉంది. వంద గ్రాముల బీట్రూట్ తిన్నా శరీరంలో చాలా తక్కువ కేలరీలు వస్తాయని న్యూట్రిషనిస్ట్ లు వివరిస్తున్నారు.