Site icon Prime9

Arthritis: ఎముకలు, కీళ్లు నొప్పులు వస్తున్నాయా అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్టే..!

arthritis

arthritis

Arthritis: తీసుకునే ఆహారం నుంచి చేసే ప్రతి పని మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కాలం మారేకొద్ది మనలో అనేక మార్పులు వస్తున్నాయి. చూస్తుండగానే శరీరంపై కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అందులో సాధరణమైనవి కీళ్ల నొప్పులు, వెన్నెముక నొప్పి మొదలైనవి. స్కూల్ బ్యాగ్ మోసే పిల్లాడినుంచి వధ్దుల వరకు ఈ నొప్పులు సహజం. దీనిని ఆర్థరైటిస్ అని కూడా అంటారు. నేడు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకువాలి, ఈ వ్యాధికి నివారణ ఏంటనే అంశాలను తెలుసుకుందాం.

భారతీయులే ఎక్కువ అందులోనే మహిళలే..

ప్రతీ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీని ప్రపంచ ఆర్థరైటిస్ దినంగా పాటిస్తున్నారు. ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే వ్యాధి. 5 ఏళ్ల పిల్లాడి 85 ఏళ్ల వయస్సు గల వద్ధుల వరకు దీని బారిన పడుతున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ పెద్ద సంఖ్యలో అంగవైకల్యానికి కారణం అవుతుంది. దాదాపు 200 రకాల ఆర్థరైటిస్లను శాస్త్రజ్ఞులు గుర్తించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వీటిలో ప్రధానమైనవి. ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి, గాయాలు, జీవనక్రియ కారణాలు, ఇన్ఫెక్షన్ దీనికి కారణాలు కావోచ్చు. వీటిలో కొన్ని వంశపారపర్యంగా వచ్చినవి కాగా మరికొని జీవినశైలి ద్వారా మారినవి, వయస్సు సంబంధినవి కూడా కావోచ్చు. మన దేశంలో ఇరవై ఒక్క కోట్లకు పైచిలుకు మంది ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని ఓ అంచన. పురుషుల కంటే స్త్రీలలో ఇది ఎక్కువగా ఈవ్యాధి కనిపిస్తున్నది. అరవై ఏళ్లకు పైబడిన భారతీయులలో 9.6శాతం పురుషులు, 18 శాతం మహిళలలో స్పష్టమైన ఆర్థరైటిస్ లక్షణాలను గుర్తించారు. వీరు కొంత కాలానికి పూర్తిగా పనిచెయ్యలేని స్థితికి చేరుకుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వ్యాయామం, బరువు నియంత్రణలో ఉంచడం వంటివి చాలా వరకు వ్యాధి తీవ్రతను తగ్గించి మెరుగైన జీవన శైలిని ఏర్పర్చుతాయి.

అవగాహణ లేమి వల్లే..

ఆర్థరైటిస్ లో కొన్నిసాధారణ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం బరువు తగ్గిపోతుంది. అలసటగా ఉంటుంది. కాళ్లు – చేతులు కదిలించటం కష్టంగా తయారవుతుంది. నిద్రలేమి, కండరాల బలహీతనత బాధపెడతాయి. ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు దీనిని గుర్తించటం చాలా ఆలస్యంగానో లేక అసలు గుర్తించకపోవడం జరుగుతుంది. ప్రజల్లో అత్యధికులకు ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవటమే ఇందుకు కారణమని హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో ఆర్థోస్కోపిక్ సర్జన్ గా పనిచేసే డాక్టర్ పి. ఎస్. జయప్రసాద్ తెలిపారు. 80-85శాతం మంది ప్రజలు వీపు నొప్పితో బాధపడుతున్నారని దీని కారణం ఒకే దగ్గర కదలకుండా కూర్చుని ఉండడమే అని డాక్టర్ జయప్రసాద్ చెప్పారు. ఈ వ్యాధికి చాలా వరకు ఫిజియోథెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని పిజియోథెరపీ నిపుణుల పర్యవేక్షణలో ప్రారంభమై కొనసాగించే కదలికలు ఆర్థరైటిస్ నొప్పిని అదుపుచేయటానికి సహాయపడుతాయని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: యువకులకే గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా..?

Exit mobile version