Site icon Prime9

Arogyashri: తెలంగాణలో మూడు జిల్లా ఆరోగ్య సేవలు తగ్గాయి

Arogyashri has decreased in three districts of Telangana

Arogyashri has decreased in three districts of Telangana

Harish Rao: తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు తగ్గిన్నట్లు మంత్రి హరీశ్ రావు చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో అధికారులు గణాంకాలు తెలియచేసాయి. ఆరోగ్య శ్రీ అమలుపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవాలపై ఆరాతీసారు.

సమీక్షలో జరిగిన సమాచారం మేరకు, గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఆగస్ట్ 31నాటికి 53శాతం మేర ఆరోగ్యశ్రీ ద్వార సర్జరీలు జరిగాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, క్యాధ్ ల్యాబ్ ల సదుపాయాలతో వైద్య సదుపాయలను పెంచ గలిగారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని గుర్తించారు.

ఆరోగ్య శ్రీ కింద సర్జరీలు చేసిన తర్వాత రోగుల‌ ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య మిత్రలతో పాటు ఆరోగ్య శ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుకోవాలని నిర్ణయించారు. సలహాలు- సూచనలతో పాటు ఆరోగ్యంలో ఏదైనా తేడా వస్తే వెంటనే ఆస్ప‌త్రులకు తరలించేలా చర్యలు చేపట్టేలా ఉండలని తీర్మానించారు.

ఆర్థోపెడిక్ కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ జరిగేలా చూడాలని హ‌రీశ్‌రావు ఆదేశించారు. లాంగ్ బోన్ ఫ్యాక్చర్ చికిత్సలు ప్రయివేటు ఆస్ప‌త్రుల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు తేల్చారు.

ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 5,600 కోట్లు ఖర్చు చేయగా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ అమలులో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచించి. ఆరోగ్య మంథన్ 2022 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆయుష్మాన్ ఉత్క్రిష్టత పురస్కారం అందచేసింది.

ఇది కూడా చదవండి:TRS: ఐలమ్మ విగ్రహం సాక్షిగా.. టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు

Exit mobile version