Delhi: టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఓ వ్యసనంగా మారింది. కొంచం తలనొప్పిగా ఉన్నా, కాలక్షేపం కోసం, లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా టీ ఇచ్చే రిలీఫ్ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఉంటుంది అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా టీ సెంటర్‌లు మనకి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఇంకా కొత్త కొత్త వెరైటీ టీలు తయారు చేస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద నివాస కాలనీ రోహిణిలోని శివచౌక్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ కొత్త టీ సెంటర్‌ను ప్రారంభించారు. ‘ఇష్క్-ఎ-చాయ్’ పేరుతో తోపుడు బండి పై ఏర్పాటు చేసిన ఈ టీ సెంటర్‌లో మనం రోజు తాగే అన్నీ టీలు ఇక్కడ ఉంటాయి.
ఈ టీ సెంటర్లో ఒక స్పెషల్ ఉందంట, టీ తాగి గ్లాస్ కూడా తినవచ్చు అంట. అదేమిటంటే ఇక్కడ చదివి తెలుసుకుందాం. కోన్ ఐస్‌క్రీంను తయారు చేసే బిస్కెట్‌లో పెట్టే విధంగా ఈ టీ ని కూడా అలాంటి తినదగిన పదార్ధంతో గ్లాసుగా తయారు చేసి దానిలో టీ పోసి ఇస్తారు. మందపాటి శంకువులతో తయారు చేసిన ఈ టీ గ్లాస్ టీ పోసిన తర్వాత 20 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కరిగిపోతుంది. కాబట్టి టీ తాగిన వెంటనే ఈ గ్లాస్‌ను కూడా తినవచ్చు.