Site icon Prime9

Karachi Halwa: 32 ఏళ్లుగా రాజస్థాన్‌లో హల్ చల్ చేస్తున్న ‘కరాచీ హల్వా’

karachi-halwa

karachi-halwa

Rajasthan: 1947వ సంవత్సరం భారతదేశం రెండు దేశాలుగా విడి పోయింది. బారత్, పాకిస్తాన్ లుగా విడిపోయిన తరువాత రెండు దేశాలనుంచి వేలాది మంది ప్రజలు అటు ఇటు వలసపోయారు. కొత్తగా సృష్టించబడిన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుండి వేలాది మంది హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. వారు వారితో పాటు వారి మాతృభూమి యొక్క అన్ని వంటకాలను ఈ కొత్త ప్రదేశానికి తీసుకువచ్చారు. వాటిలో కరాచీ హల్వా ఒకటి. ప్రతి పండుగ సందర్భంగా, సింధ్ ప్రజలు తప్పనిసరిగా కరాచీ హల్వాను తయారు చేస్తారు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన భారీ సింధీ జనాభా ఉన్న రాజస్దాన్ లోని బార్మెర్‌లో కూడా ప్రతి ఇంటివారు ఈ రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నారు.

కరాచీ హల్వాలో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇది 6 నెలల పాటు ఉంటుంది. ఈ హల్వా తయారీ విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. గోధుమలను 8 రోజులు నీటిలో నానబెట్టి, ఆ సమయంలో నీరు చాలాసార్లు మార్చబడుతుంది. తర్వాత ఎండబెట్టి పిండిలా చేస్తారు. ఈ పిండి నుండి తయారయ్యే తెల్లటి క్రీమును నిశాస్తా అంటారు. కరాచీ హల్వా తయారు చేసేందుకు నెయ్యి, పంచదార, జీడిపప్పు, బాదం, పిస్తా, తిజారా తదితరాలను నిషాస్తాలో కలుపుతారు. కనీసం 5-6 కిలోల హల్వా తయారవుతుంది.ఈ హల్వా చేయడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్ నుండి 1991లో ఇక్కడికి వలస వచ్చిన హేమ్‌రాజ్ ఖత్రీ, కరాచీ హల్వాను తయారు చేయడంలో నిపుణుడు. పండుగల సమయంలో, ప్రజలు దానిని కొనుగోలు చేయడానికి అతని షాపుకు తరలి వస్తారు.

హేమ్‌రాజ్ కొడుకు ముఖేష్ కరాచీ హల్వాను తయారు చేసే వారసత్వాన్ని తాను కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. అతను విభిన్న రుచులను కలిగి ఉండే మూడు రకాల కరాచీ హల్వాను తయారుచేస్తాడు. పిస్తాతో తయారుచేసినది కిలోరూ.900, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసినది కిలో రూ. 650 మరియు తక్కువ పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ ఉన్న హల్వా రూ. 450 కి అమ్ముతారు. దీపావళి నాడు, అతను 150 కిలోల కరాచీ హల్వాను విక్రయిస్తాడు. బార్మెర్ నుంచి ఈ హల్వా ఇపుడు చెన్నై, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ మరియు ఇతర నగరాల్లోని ప్రజలను అలరిస్తోంది.

Exit mobile version