Tandur: నాణ్యతలో మేటి.. రుచిలో సాటి.. ఈ కందిపప్పు టేస్టే వేరు

Tandur: పప్పుల్లో చాలా రకాలు ఉంటాయి.. కానీ అందులో ఈ పప్పు వేరు.. కాదు కాదు ఇక్కడ పండించిన కందిపప్పే ప్రత్యేకం. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే మన తాండూర్ వెళ్లాల్సిందే.
ఇక్కడ పండించే కందిపప్పు  చాలా ప్రత్యేకం.. ఈ పప్పుకు నాణ్యతలో మరేది సాటి రాదు.. అలాగే రుచి కూడా వేరు. అందుకే ఇక్కడ పండించే కందిపప్పుకు డిమాండ్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఈ కంది పప్పుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే భౌగోళిక గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.

ఇతర రాష్ట్రాల్లో పండించిన కందులతో పోలీస్తే.. తాండూరులో పండించిన పప్పు ప్రసిద్ధి చెందింది.

దానికి కారణం ఇక్కడి నేల స్వభావం వల్ల పప్పు రుచికరంగా ఉండడం.

మరో విశేషం ఏంటంటే? ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది. వండిన పప్పు రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది

. ప్రతి ఏడాది తాండూరు మార్కెట్ యార్డులో దాదాపు వంద కోట్ల కందుల వ్యాపారం జరుగుతుందని అంచనా.

పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కందులు రవాణా అవుతాయి.

రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ పంటకు.. భౌగోళిక గుర్తింపు లభించినట్లు కేంద్రం తెలిపింది.

దీనితో దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరిందని వివరించింది.

తాండూరు కందిపప్పు ప్రత్యేకత..

నాణ్యతాపరంగా తాండూరు కందిపప్పుకి విశిష్ట లక్షణాలు ఉన్నాయి.

రుచి, సువాసనతో పాటు.. పోషకాల మెండుగా దీనిలో ఉంటాయి.

దీంతో ఈ కందికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తాండూరు నేలల స్వభావం, భూమిలోని పోషకాలు ఈ పంటకు మేలు చేస్తున్నాయి.

ఇక్కడ రైతులు ఆచరించే సాంప్రదాయ పద్దతులు కూడా ఈ పంటకి గుర్తింపు తెచ్చాయి.

తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగు చేస్తుంటారు రైతులు.

 

భౌగోళిక గుర్తింపు సాధించిన రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బనగానపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దానీ చీరలు కూడా ఉన్నాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/