Site icon Prime9

Nayanathara: ’లేడీ సూపర్ స్టార్ 75 ‘ గా నయనతార

Tollywood: లేడీ సూపర్ స్టార్ నయనతారకు తమిళనాడు అంతటా విపరీతమైన అభిమానం ఉంది ఆమె తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా చేయాలని నిర్ణయించుకుంది. నయన్ 75వ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. లేడీ సూపర్ స్టార్ 75 అని తాత్కాలికంగా పిలవబడే ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మిస్తుంది. స్పెషల్ వీడియో టీజర్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. గతంలో శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నీలేష్ కృష్ణ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నాడు. సత్యరాజ్, జై ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నయనతార బాలీవుడ్‌లో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి చిత్రం జవాన్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇందులో షారుఖ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. సన్యా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version